...
...
Next Story

TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ డౌన్లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ (TG ECET) తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Published on: Jun 24, 2026 08:32 AM IST
Advertisement

TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ - 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం నిర్వహించిన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు. అధికారిక వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

టీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు (istock image)
టీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు (istock image)

రాష్ట్రవ్యాప్తంగా బీటెక్‌ కోర్సుల్లో మొత్తం 13,610 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి విడతలో 8,799 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. అంటే మొత్తం సీట్లలో సుమారు 65 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 35 శాతం సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.

ఇక బీఫార్మసీ కోర్సుల్లో చూస్తే…. విద్యార్థుల నుంచి ఆదరణ చాలా తక్కువగా కనిపించింది. రాష్ట్రంలో మొత్తం 1,280 బీఫార్మసీ సీట్లు అందుబాటులో ఉంటే, కేవలం 30 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ శ్రీదేవసేన పేర్కొన్నారు.

అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా…

  1. అభ్యర్థులు ముందుగా https://tgecet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
  3. మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత…. అలాట్ మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది.
  4. దీనిపై క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీటు దక్కిందో డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ కాపీ తప్పనిసరి.

రిపోర్టింగ్ తేదీలు…

నిర్దేశిత గడువులోగా ఫీజు చెల్లించని వారి సీట్లు రద్దవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ ఆర్డర్, ఫీజు రశీదులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe