...
...
Next Story

TG EdCET 2026 Counseling : తెలంగాణ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 21 నుంచి రిజిస్ట్రేషన్లు

TG EdCET counseling schedule 2026 : తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Jul 14, 2026, 05:12:18 IST
Advertisement

TG EdCET counseling schedule 2026 : తెలంగాణలో బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇందుకు సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా…. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ ఎడ్ సెట్ 2026
తెలంగాణ ఎడ్ సెట్ 2026

కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం…. జూలై 21 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీ ఎడ్‌సెట్ (TG EdCET-2026) కౌన్సెలింగ్ తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: 14-07-2026
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల అప్‌లోడింగ్ : 21-07-2026 నుండి 28-07-2026 వరకు
  • ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల (NCC / CAP / PH / Sports) ఫిజికల్ వెరిఫికేషన్: 28-07-2026 నుండి 31-07-2026 వరకు (ఉస్మానియా యూనివర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కేంద్రంలో జరుగుతుంది).
  • ఎన్‌సీసీ అభ్యర్థులకు జూలై 28న, క్యాప్ & పీహెచ్ అభ్యర్థులకు జూలై 29న, స్పోర్ట్స్ అభ్యర్థులకు జూలై 31న వెరిఫికేషన్ ఉంటుంది.
  • రిజిస్టర్డ్ అభ్యర్థుల జాబితా ప్రదర్శన (సవరణలకు అవకాశం) : 01-08-2026
  • వెబ్ ఆప్షన్ల నమోదు (మొదటి విడత) : 02-08-2026 నుండి 04-08-2026 వరకు
  • వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్ ఆప్షన్) : 04-08-2026
  • మొదటి విడత సీట్ల కేటాయింపు (కళాశాలల వారీగా) : 08-08-2026
  • కళాశాలల్లో రిపోర్టింగ్, ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలన, ఫీజు చెల్లింపు : 10-08-2026 నుండి 14-08-2026 వరకు

కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎడ్‌సెట్ అభ్యర్థులు https://edcetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మొత్తం 28,771 మంది అభ్యర్థులు ఈ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 27,887 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.ఓవరాల్‌గా 96.95 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఈ ఫలితాలలో మెథడాలజీల వారీగా చూసుకుంటే గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ విభాగాల్లో అభ్యర్థులు మంచి ప్రతిభ కనబరిచారు.

టీజీ ఎడ్ సెట్ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా:

  • మొదటగా అధికారిక కన్వీనర్ వెబ్‌సైట్‌ https://edcet.tgche.ac.in / ను సందర్శించాలి.
  • హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ ఎడ్‌సెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
  • స్క్రీన్‌పై కనిపించే మీ ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకుని, భవిష్యత్తు కౌన్సెలింగ్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe