TG LAWCET Counselling : లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ - కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ఈనెల 16 నుంచి వెబ్ ఆప్షన్లు

TG LAWCET Counselling Schedule 2026 : ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 10లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jul 5, 2026, 13:44:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ లాసెట్ - 2026 రాసిన అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కోర్సు అయిన ఎల్‌ఎల్‌ఎం (LLM) లలో ప్రవేశాలు పొందాలనుకునే వాళ్లు… రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

టీజీ లాసెట్ కౌన్సెలి్ంగ్ 2026
టీజీ లాసెట్ కౌన్సెలి్ంగ్ 2026

ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జూలై 10తోనే ఈ ఆన్‌లైన్ నమోదు(రిజిస్ట్రేషన్), ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని సూచించారు.

  • జులై 5(ఇవాళ) నుంచి జూలై 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు జులై 16 నుండి జులై 19 వరకు తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు జులై 24వ తేదీన ఎల్‌ఎల్‌బీ సీట్లను కేటాయిస్తారు.

కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు తమ లాసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. https://lawcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఆధారంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత జూలై 16 నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.

ఎల్‌ఎల్‌ఎం (పీజీఎల్‌సెట్) కౌన్సెలింగ్ వివరాలు:

ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ క్రింది విధంగా ఉంది…

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ : జూలై 27 నుంచి జూలై 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు.

వెబ్ ఆప్షన్ల నమోదు : రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 1 మరియు ఆగస్టు 2 తేదీల్లో తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్ల రూపంలో ఎంచుకోవాల్సి ఉంటుంది.

సీట్ల కేటాయింపు: అభ్యర్థుల మెరిట్ మార్కులు, రిజర్వేషన్లు మరియు వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 5వ తేదీన ఎల్‌ఎల్‌ఎం మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More