TG LAWCET 2026 Counselling : తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలు
TG LAWCET Counselling Schedule 2026 : ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జులై 5 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలు ఇవే.
TG LAWCET Counselling Schedule 2026 : న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి గురువారం ఈ ప్రకటన చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.

టీజీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ :
- రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ సీట్ల భర్తీకి జులై 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
- జులై 5 నుంచి జూలై 10 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులు జులై 16 నుండి జులై 19 వరకు తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు జులై 24వ తేదీన ఎల్‌ఎల్‌బీ సీట్లను కేటాయిస్తారు.
ఎల్‌ఎల్‌ఎం కోర్సుల కౌన్సెలింగ్ వివరాలు :
పీజీ లా కోర్సు అయిన ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా కన్వీనర్ వెల్లడించారు.
- జులై 27 నుండి జులై 31 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.
- ఆగస్టు 1, 2 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
- ఆగస్టు 5వ తేదీన ఎల్‌ఎల్‌ఎం సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తారు.
లాసెట్ 2026 - ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ ఇలా :
- అభ్యర్థులు మొదటగా తెలంగాణ లాసెట్ అధికారిక వెబ్‌సైట్ https://lawcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
- హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ లాసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరుచుకోవడం మంచిది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

