...
...
Next Story

TG EdCET 2026 Counseling : టీజీ ఎడ్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

TG EdCET 2026 Counseling Schedule : తెలంగాణ ఎడ్‌సెట్ 2026 చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 3వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

Published on: Sep 1, 2026, 17:10:24 IST
Advertisement

TG EdCET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ ఎడ్‌సెట్-2026' ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు సెప్టెంబర్ 3వ తేదీతో ముగుస్తుంది.

టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు
టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు

మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులకు, అలాగే సీటు లభించని అభ్యర్థులకు ఈ విడత చివరి అవకాశమని అధికారులు తెలిపారు. విద్యార్థులు నిర్దేశిత తేదీల్లోగా సర్టిఫికేట్ల పరిశీలన నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ముఖ్య తేదీలు :

  • మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు ఆగస్టు 29, 2026 నుంచి సెప్టెంబర్ 3, 2026 వరకు ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసుకుని, ఫీజు చెల్లించి, ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ధృవీకరణ పూర్తయిన అర్హుల జాబితాను సెప్టెంబర్ 5, 2026న వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. సర్టిఫికేట్ల దరఖాస్తులో ఏవైనా సవరణలు ఉంటే ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
  • అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 6, 2026 నుంచి సెప్టెంబర్ 8, 2026 వరకు తమకు నచ్చిన కళాశాలల కోసం వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
  • నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ 9, 2026న అవకాశం కల్పించారు.
  • కళాశాలల వారీగా తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల సీట్ల కేటాయింపు జాబితాను సెప్టెంబర్ 12, 2026న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
  • సీటు పొందిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ట్యూషన్ ఫీజు చెల్లింపు రసీదుతో సెప్టెంబర్ 15, 2026 నుంచి సెప్టెంబర్ 19, 2026 లోపు కేటాయించిన కళాశాలల్లో నేరుగా రిపోర్టింగ్ చేయాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://edcet.tgche.ac.in/

టీజీ ఎడ్ సెట్ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా….

  • మొదటగా అధికారిక కన్వీనర్ వెబ్‌సైట్‌ https://edcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
  • హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ ఎడ్‌సెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
  • స్క్రీన్‌పై కనిపించే మీ ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకుని, భవిష్యత్తు కౌన్సెలింగ్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe