...
...
Next Story

TG Edcet 2026 Updates : టీజీ ఎడ్‌సెట్ దరఖాస్తులు ప్రారంభం - దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలివే

TG Edcet Notification 2026 : టీజీ ఎడ్‌సెట్ -2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.ఏప్రిల్ 18వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు.మే 12వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు.

Published on: Feb 28, 2026 10:37 AM IST
Advertisement

రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

దరఖాస్తు తేదీలు….

తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తులు (image source istoc)
తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తులు (image source istoc)

ప్రస్తుతం తెలంగాణ ఎడ్‌సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఇక ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులకు రూ.550 గా నిర్ణయించారు.

అర్హతలు…

టీజీ ఎడ్‌సెట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే… డిగ్రీ పూర్తి అయిన అభ్యర్థులు అర్హులవుతారు. వారి విద్యా అర్హతల ఆధారంగా సంబంధిత సబ్జెక్టును ఎంచుకుంటారు. ఈ ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2 గంటల సమయం ఉంటుంది.

పరీక్ష తేదీ….

టీజీ ఎడ్ సెట్ - 2026 పరీక్షను మే 12వ తేదీన నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పూర్తి చేస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు.

టీజీ ఎడ్ సెట్ - అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…

  1. ముందుగా https://edcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని Application Fee Payment లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత Fill Application Form పై నొక్కాలి. ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి
  4. ప్రొసిడ్ ఫిల్ అప్లికేషన్ పై నొక్కితే దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  5. ఇక్కడ మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయటంతో పాటు ఫొటో, సంతకం కూడా అప్ లోడ చేయాలి.
  6. చివరగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  7. రిజిస్ట్రేషన్ ఐడీ నెంబర్ తో హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe