SBI CBO Recruitment : ఎస్బీఐలో భారీగా పోస్టులు- డిగ్రీ ఉంటే చాలు! పూర్తి వివరాలు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2050 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఫిబ్రవరి 18, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 30, 2026, 05:24:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 2050 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026 (Bloomberg)
ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026 (Bloomberg)

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026- ముఖ్యమైన తేదీలు..

ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జనవరి 29, 2026 నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 18, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అభ్యర్థులు ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026- పూర్తి వివరాలు..

విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించిన ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (ఐడీడీ) ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), కాస్ట్ అకౌంటెంట్ వంటి వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా అవకాశం కల్పించారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 01.01.1996 కంటే ముందు, 31.12.2004 కంటే తర్వాత జన్మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక మొత్తం మూడు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్ పరీక్ష, ఆ తర్వాత స్క్రీనింగ్, చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది.

ఆన్‌లైన్ పరీక్ష: ఇందులో 120 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి.

డిస్క్రిప్టివ్ టెస్ట్: ఆబ్జెక్టివ్ పరీక్ష ముగిసిన వెంటనే ఈ టెస్ట్ నిర్వహిస్తారు. 30 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై ఇంగ్లీష్ లెటర్ రైటింగ్, ఎస్సే (వ్యాసం) టైప్ చేయాల్సి ఉంటుంది.

ఉత్తీర్ణత: ఈ పరీక్షలో సెక్షనల్ క్వాలిఫైయింగ్ మార్కులు ఉండవు. బ్యాంక్ నిర్ణయించిన మొత్తం అగ్రిగేట్ మార్కులను సాధిస్తే సరిపోతుంది.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ) ఎలాంటి ఫీజు లేదు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్ సమయంలో అదనపు లావాదేవీల ఛార్జీలు ఉంటే అభ్యర్థులే భరించాల్సి ఉంటుంది.

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అధికారిక పోర్టల్‌ను సందర్శించగలరు.

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్బీఐ సీబీఓ రిక్రూట్​మెంట్​ 2026 అప్లికేషన్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More