సంక్రాంతికి షాపింగ్ చేస్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులతో భారీగా డబ్బులు ఆదా..
ఈ సంక్రాంతికి షాపింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! కొన్ని క్రెడిట్ కార్డులు ఆన్లైన్ షాపింగ్‌పై అదిరిపోయే బెనిఫిట్స్‌ని ఇస్తున్నాయి. వీటి ద్వారా మీరు భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి 2026 సమీపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది తమ బ్యాగులు సద్దుకుని సొంతూళ్లకు కూడా వెళ్లిపోయారు. అయితే, సంక్రాంతి అంటే కేవలం కైట్లు, పిండి వంటలు, కోడి పందేలే కాదు.. షాపింగ్ కూడా! పండుగ వేళ కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మరి మీరు పండుగ షాపింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఆన్లైన్ షాపింగ్‌కి సంబంధించి కొన్ని బెస్ట్ క్రెడిట్ కార్డులు, వాటి బెనిఫిట్స్‌ని ఇక్కడ తెలుసుకోండి. అంతేకాదు, కొన్నింటిలో బుక్‌మైషో, స్విగ్గీ, జొమాటో ఆర్డర్లపైనా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటి ద్వారా మీరు చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

సంక్రాంతి 2026 షాపింగ్: ఈ క్రెడిట్ కార్డులతో భారీగా డబ్బులు ఆదా..
- హెచ్డీఎఫ్సీ మిలీనియల్ క్రెడిట్ కార్డు-
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో కొనుగోళ్లపై 5శాతం క్యాష్‌బ్యాక్.
- బుక్‌మైషో, జొమాటో ఆర్డర్లపైనా 5శాతం క్యాష్‌బ్యాక్.
- ఇతర కేటగిరీల్లో కొనుగోళ్లపై 1శాతం క్యాష్‌బ్యాక్.
ఇతర వివరాలు:
స్విగ్గీ డైనౌట్పై 10శాతం అదనపు డిస్కౌంట్.
రూ. 400 నుంచి రూ. 5వేల ఇంధన ఖర్చులపై 1శాతం సర్ఛార్జ్ తగ్గింపు.
ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు- రూ. 1000, వార్షిక ఫీజు రూ. 1000
2. హెచ్డీఎఫ్సీ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డు-
- ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ కొనుగోళ్లపై 10ఎక్స్ క్యాష్పాయింట్స్.
- స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌పై 10ఎక్స్ క్యాష్పాయింట్స్.
- ఇతర కేటగిరీల్లో ఖర్చులపై (కనీసం రూ. 150) 2ఎక్స్ క్యాష్పాయింట్స్
- ప్రతియేటా రూ. 2000 వరకు గిఫ్ట్ వోచర్.
ఇతర వివరాలు:
వెల్కమ్ బెనిఫిట్ కింద 500 క్యాష్పాయింట్స్ ఫ్రీ.
ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు- రూ. 500, వార్షిక ఫీజు- రూ. 500
3. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు-
- మింత్రాలో కొనుగోళ్లపై 7.5శాతం వరకు క్యాష్‌బ్యాక్.
- ఫ్లిప్‌కార్ట్, క్లియర్‌ట్రిప్ ట్రాన్సాక్షన్స్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్.
ఇతర వివరాలు:
ఇతర ఖర్చులపై 1శాతం క్యాష్‌బ్యాక్.
ఫ్లిప్‌కార్ట్, స్లిగ్గీ నుంచి రూ. 600 వరకు యాక్టివేషన్ బెనిఫిట్స్.
రూ. 400 నుంచి రూ. 4వేల ఇంధన ఖర్చులపై 1శాతం సర్ఛార్జ్ తగ్గింపు.
ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు- రూ. 500, వార్షిక ఫీజు- రూ. 500
4. ఎస్బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డు-
- మింత్రా కొనుగోళ్లపై 10ఎక్స్ రివార్డ్ పాయింట్స్.
- బుక్‌మైషో, స్విగ్గీ ఆర్డర్లపై 10ఎక్స్ రివార్డ్ పాయింట్స్.
- జాయినింగ్ ఫీ పేమెంట్ చేస్తే రూ. 500 విలువ చేసే అమెజాన్ ఇండియా గిఫ్ట్ కార్డు ఫ్రీ.
ఇతర వివరాలు:
ఇతర కేటగిరీల్లో కొనుగోళ్లపై (కనీసం రూ. 100) 1 రివార్డ్ పాయింట్
కార్డు ద్వారా రూ. 1లక్ష, రూ. 2లక్షలు ఖర్చు చేస్తే క్లియర్‌ట్రిప్, యాత్రా నుంచి రూ. 2వేలు విలువ చేసే ఈ-వోచర్లు.
కార్డు ద్వారా రూ. 1లక్ష కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే వార్షిక రుసుము 0.
ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు- రూ. 499, వార్షిక ఫీజు- రూ. 499
5. క్యాష్‌బ్యాక్ ఎస్బీఐ కార్డు-
- అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్.
- ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ట్రాన్సాక్షన్స్‌పై 1శాతం క్యాష్‌బ్యాక్.
ఇతర వివరాలు:
ప్రతి నెల రూ. 5వేల వరకు క్యాష్‌బ్యాక్.
కార్డు ద్వారా ప్రతియేటా రూ. 2లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుమును తిరిగి చెల్లిస్తారు.
ఈ క్రెడిట్ కార్డు జాయినింగ్ ఫీజు- రూ. 999, వార్షిక ఫీజు- రూ. 999
* ఆయా క్రెడిట్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత బ్యాంకులకు సంప్రదించాల్సి ఉంటుంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


