రివార్డు పాయింట్స్, హోటల్ స్టే నుంచి లాంజ్ యాక్సెస్ వరకు.. 5 బెస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డులు ఇవి..
మీరు మీ లైఫ్‌స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ 5 ప్రీమియం క్రెడిట్ కార్డులు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. రివార్డు పాయింట్స్ నుంచి లాంజ్ యాక్సెస్ వరకు అనేక బెనిఫిట్స్ ఉన్నాయి..
మీరు క్రెడిట్ కార్డు వాడుతూ లగ్జరీ లైఫ్‌స్టైల్ కోరుకునే వారైతే, సరైన కార్డును ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కార్డులు ఆకర్షణీయమైన రివార్డు పాయింట్ల కోసం ప్రసిద్ధి చెందితే, మరికొన్ని రెస్టారెంట్లలో తినడానికి ప్రాధాన్యత ఇస్తాయి. అయితే, ఇక్కడ మేము మీ జీవనశైలిని మెరుగుపరచడానికి దోహదపడే కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డులను జాబితా చేస్తున్నాము. ఈ కార్డులు లాంజ్ యాక్సెస్, గోల్ఫ్ కోర్సు సెషన్‌లు, హోటళ్లలో బస, రివార్డు పాయింట్లు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

మీ జీవనశైలిని పెంచే 5 ప్రీమియం కార్డులు..
1. హెచ్డీఎఫ్సీ ఇన్ఫినియా మెటల్ ఎడిషన్..
ఈ క్రెడిట్ కార్డు అత్యధిక రివార్డులు, లగ్జరీ ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుంది.
రివార్డులు: ప్రతి రూ. 150 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లను అందిస్తుంది.
సేవలు: 24X7 గ్లోబల్ పర్సనల్ కనసర్జ్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
హోటల్ బెనిఫిట్స్: ఐటీసీ హోటళ్లలో ఒక కాంప్లిమెంటరీ బస, పాల్గొనే ఐటీసీ హోటళ్లలో 1+1 కాంప్లిమెంటరీ బఫేకి మీరు అర్హులు.
ప్రత్యేక ప్రయోజనం: మొదటి సంవత్సరానికి కాంప్లిమెంటరీ క్లబ్ మారియట్ మెంబర్‌షిప్ లభిస్తుంది. దీని ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా డైనింగ్, బసపై 25% వరకు తగ్గింపులు పొందవచ్చు. భారతదేశంలోని పాల్గొనే రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లుపై 50% తగ్గింపు కూడా కార్డుదారులకు లభిస్తుంది.
2. ఐసీఐసీఐ ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్
ఈ ప్రీమియం క్రెడిట్ కార్డు ప్రత్యేకమైన రాయల్టీ ప్రయోజనాలకు పేరు గాంచింది.
మెంబర్‌షిప్ అండ్ రివార్డులు: తాజ్ ఎపిక్యూర్ ప్లస్ మెంబర్‌షిప్, ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్‌షిప్, భారీగా 12,500 రివార్డు పాయింట్లను అందిస్తుంది.
లగ్జరీ ఆఫర్లు: ప్రైమరీ, అదనపు కార్డు సభ్యులకు ప్రతి నెలా అపరిమిత గోల్ఫ్ రౌండ్‌లు, అపరిమిత అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ సౌకర్యం ఉంటుంది.
ఇతర ప్రయోజనాలు: సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు చేస్తే 2 ఈజ్‌మైట్రిప్ వోచర్‌లు, అలాగే దేశీయ విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లపై ఎటువంటి కాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది.
3. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్
ఈ క్రెడిట్ కార్డు లగ్జరీ బ్రాండ్ వోచర్‌లు, హోటల్ డిస్కౌంట్ల కోసం ప్రాధాన్యత వహిస్తుంది.
ప్రారంభ ఆఫర్: మాగ్నస్ క్రెడిట్ కార్డుతో పాటు రూ. 12,500 విలువైన కాంప్లిమెంటరీ లగ్జరీ బ్రాండ్ వోచర్‌ను అందిస్తుంది.
హోటల్ డిస్కౌంట్‌లు: అగ్రశ్రేణి హోటళ్లలో ప్రత్యేక ఆఫర్‌లలో భాగంగా, అంతర్జాతీయ, దేశీయ ఒబెరాయ్ అండ్ ట్రిడెంట్ హోటళ్లలో 15% తగ్గింపు లభిస్తుంది.
డైనింగ్ ఆఫర్: భారతదేశం అంతటా వివిధ రెస్టారెంట్లలో 30% తగ్గింపును కూడా పొందవచ్చు.
4. ఎస్బీఐ ఆరమ్
ఎస్బీఐకు చెందిన ఈ సూపర్ ప్రీమియం క్రెడిట్ కార్డును ప్రత్యేకంగా ఉన్నత వర్గాల కోసం రూపొందిచారు.
కాంసియార్జ్ సేవ: హోటల్ రిజర్వేషన్లు, విమాన టికెట్ల బుకింగ్ వంటి వాటికి కాంసియార్జ్ సర్వీస్ లభిస్తుంది.
గోల్ఫ్ ప్రివిలేజెస్: ఆరమ్ క్రెడిట్ కార్డు వెబ్‌సైట్ ప్రకారం, కార్డుదారులు ప్రతి సంవత్సరం 16 కాంప్లిమెంటరీ గోల్ఫ్ రౌండ్‌లను ఆస్వాదించవచ్చు.
మైల్‌స్టోన్ ప్రయోజనాలు: నిర్దిష్ట వార్షిక ఖర్చుల లక్ష్యాలను చేరుకున్నప్పుడు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.
వార్షికంగా రూ. 10 లక్షలు ఖర్చు చేసిన తర్వాత తాజ్ ఎక్స్పీరియెన్సెస్ వోచర్ లభిస్తుంది.
వార్షికంగా రూ. 12 లక్షలు ఖర్చు చేస్తే, వార్షిక ఫీజు మాఫీ సదుపాయం ఉంటుంది.
వెల్కమ్ బెనిఫిట్: తొలి వార్షిక ఫీజు చెల్లించిన వెంటనే, రూ. 10,000 విలువైన 40,000 ఆరమ్ రివార్డు పాయింట్లు లభిస్తాయి.
5. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ప్లాటినం
అంతర్జాతీయ ప్రయాణాలకు, అగ్రశ్రేణి లగ్జరీకి ఈ క్రెడిట్ కార్డు ప్రసిద్ధి చెందింది.
హోటల్ ప్రయోజనాలు: ఫైన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ కలెక్షన్ కింద ఉన్న 1000+ హోటళ్లలో బుక్ చేసిన ప్రతిసారీ రూ. 44,300 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు (ఉదాహరణకు, రూమ్ అప్‌గ్రేడ్‌లు, ఉచిత అల్పాహారం, 4పీఎం లేట్ చెకౌట్, 100 డాలర్ల క్రెడిట్).
లాంజ్ యాక్సెస్: ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి విమానాశ్రయాలలో ఉన్న 1,550 కంటే ఎక్కువ లాంజ్‌లకు (ది సెంచురియన్ లాంజ్‌తో పాటు) అపరిమిత యాక్సెస్ లభిస్తుంది.
ఈ జాబితాలోని కార్డుల ప్రయోజనాలు, నిబంధనలు ఎప్పటికప్పుడు మారవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌లో తాజా వివరాలను తనిఖీ చేసుకోగలరు.

E-Paper












