పూర్ణియా నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభం
బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా నగరం నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ విమాన సర్వీసు ప్రారంభమైంది. అంతేకాదు పూర్ణియా నుంచి దిల్లీకికి కూడా సర్వీసు ముదలైంది.
బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా విమానాశ్రయం తన సేవలను కొత్త విమానాశ్రయాలకు విస్తరించింది. దిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలతో ప్రత్యక్ష కనెక్టివిటీని ఏర్పాటు చేసింది. గత నెలలో వాణిజ్య విమాన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్ నగరానికి పూర్ణియా నుంచి నేరుగా కొత్త సేవలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని, ఐటీ నగరానికి నేరుగా ప్రయాణించే అవకాశాలు పెరిగాయని ప్రయాణికులు సంతోషంగా ఉన్నారు. ప్రత్యక్ష కనెక్టివిటీ ప్రయాణ ఖర్చులను తగ్గించదు.. కానీ సమయాన్ని ఆదా చేస్తుంది.
పూర్ణియా విమానాశ్రయ డైరెక్టర్ డీపీ గుప్తా మాట్లాడుతూ.. ఆదివారం నాడు విమానం తొలిసారిగా పూర్ణియా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. దిల్లీ నుండి బయలుదేరిన విమానంలోని అన్ని సీట్లు నిండిపోయాయి, హైదరాబాద్ వెళ్లే విమానంలో కూడా 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంది. గత రెండు రోజులుగా టిక్కెట్లకు మంచి డిమాండ్ ఉందని, ప్రజలలో ఉత్సాహం ఉందని ఆయన వివరించారు.
పూర్ణియా నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న బిట్స్ పిలాని విద్యార్థి అర్ష్ మాట్లాడుతూ.. గతంలో దిల్లీ లేదా పాట్నా నుండి పూర్ణియా చేరుకోవడం కష్టంగా ఉండేది. ఇప్పుడు విమాన సేవలు ప్రారంభించడంతో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సమయం ఆదా అవుతుందన్నారు.
ముదటి రోజున ఇండిగో విమానం ఉదయం 10:45 గంటలకు దిల్లీ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:50 గంటలకు పూర్ణియా విమానాశ్రయానికి చేరుకుందని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు. దిల్లీకి వెళ్లే విమానం మధ్యాహ్నం 1:50 గంటలకు పూర్ణియా విమానాశ్రయం నుండి బయలుదేరి మధ్యాహ్నం 3:55 గంటలకు ఢిల్లీకి చేరుకుంది.
హైదరాబాద్ నుండి పూర్ణియాకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ నుండి పూర్ణియాకు ఇండిగో విమానం.. పూర్ణియా చేరుకునే సమయం మధ్యాహ్నం 2:25 గంటలకు, పూర్ణియా నుండి బయలుదేరే సమయం మధ్యాహ్నం 3:25 గంటలకు షెడ్యూల్ చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


