సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో 2026 నుండి కొత్త పీజీ, యూజీ కోర్సులు

విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరం నుండి అనేక కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెడుతుంది.

Published on: Jan 29, 2026, 06:31:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(CUAP)లో 2026–27 విద్యా సంవత్సరం నుండి అనేక కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి ప్రకటించారు. వాటిలో జెనోమిక్ సైన్స్‌లో MSc, కెమిస్ట్రీలో MSc, MCA ఉన్నాయి.

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో కొత్త కోర్సులు
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో కొత్త కోర్సులు

ప్రొఫెసర్ కోరి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం 2020, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ, పరిశోధన అవసరాలకు అనుగుణంగా విద్యాపరమైన ఆఫర్‌ల కోసం విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బిటెక్ ప్రోగ్రామ్(CSE) ప్రవేశపెట్టడంతో, ఆచరణాత్మక, నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు అప్‌గ్రేడ్ అయ్యాయని అన్నారు.

అనంతపురం నుండి 15 కి.మీ దూరంలో జంతలూరు వద్ద 492 ఎకరాల్లో విస్తరించి ఉంది సీయూఏపీ. ప్రస్తుతం బాలురు, బాలికల కోసం ప్రత్యేక హాస్టళ్లలో 700 మందికి పైగా విద్యార్థులకు వసతి కల్పిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను పొందుతున్నారు.

యూజీ కోర్సులు

ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఎనిమిది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది, వాటిలో బిటెక్ (సిఎస్‌ఇ), బీఎస్సీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బీఏ(పొలిటికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్), బీఎస్సీ (సైకాలజీ), బీకాం, బీబీఏ, బీఎస్సీ (రిటైల్ మేనేజ్‌మెంట్) ఉన్నాయి.

పీజీ కోర్సులు

పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సీయూఏపీ 17 ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. వాటిలో MSc స్పేస్ సైన్స్ టెక్నాలజీ, MSc క్లినికల్ సైకాలజీ, MSc మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్ సైన్సెస్, MSc ఎకనామిక్స్, MA ఇన్ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, హిందీ, తెలుగు, ఎంబీఏ, ఎంకామ్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. కొత్తగా ప్రకటించిన MSc జెనోమిక్ సైన్స్, MSc కెమిస్ట్రీ, BTech(CSE) కోర్సులు అవకాశాలను మరింత విస్తరిస్తాయని ప్రొఫెసర్ కోరి అన్నారు.

స్టూడియో ఏర్పాటు

తదుపరి సెమిస్టర్‌లో ప్రతి ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థికి 20 శాతం ఫీజు మినహాయింపు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్, బ్లెండెడ్ లెర్నింగ్‌కు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక ఇ-స్టూడియో ఏర్పాటును కూడా వైస్-ఛాన్సలర్ ప్రకటించారు. ఎన్ఈపీ 2020, జాతీయ డిజిటల్ విద్యా లక్ష్యాలకు అనుగుణంగా హై క్వాలిటీ ఈ-కంటెంట్, ఆన్‌లైన్ కోర్సులు, పాడ్‌కాస్ట్‌లను రూపొందించడానికి ఈ సౌకర్యాలను ఉపయోగిస్తారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More