TG EdCET 2026 Counselling : తెలంగాణ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - కొత్త తేదీలివే
TG EdCET 2026 Counselling : టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను పొడిగించారు. ఆగస్టు 3 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
TG EdCET 2026 Counselling : రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సులో చేరేందుకు నిర్వహించే ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. తాజాగా కౌన్సెలింగ్ గడువును అధికారులు పొడిగించారు. సవరించిన నూతన షెడ్యూల్‌ను ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి మంగళవారం విడుదల చేశారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం…. అభ్యర్థులు తమ ధృవపత్రాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ , ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను ఆగస్టు 3, 2026 వరకు పూర్తి చేసుకోవచ్చు. సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులకు ఈ గడువు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ చివరి తేదీ : 2026 ఆగస్టు 3
- అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన (ఫిర్యాదుల స్వీకరణ): 2026 ఆగస్టు 6
- మొదటి విడత వెబ్ ఆప్షన్ల ఎంపిక: 2026 ఆగస్టు 7 నుంచి 10 వరకు
- వెబ్ ఆప్షన్ల సవరణ (ఎడిట్) అవకాశం : 2026 ఆగస్టు 11
- మొదటి విడత కళాశాలల వారీగా సీట్ల కేటాయింపు: 2026 ఆగస్టు 16
- సర్టిఫికెట్ల పరిశీలన, రిపోర్టింగ్: 2026 ఆగస్టు 17 నుంచి 20 వరకు
"అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి," అని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సూచించారు. వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయిన తర్వాత…. ఆగస్టు 16న తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు కేటాయించిన వ్యవధిలోనే సంబంధిత కళాశాలలకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మొత్తం 28,771 మంది అభ్యర్థులు ఈ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 27,887 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు.ఓవరాల్‌గా 96.95 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. ఈ ఫలితాలలో మెథడాలజీల వారీగా చూసుకుంటే గణితం, సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ విభాగాల్లో అభ్యర్థులు మంచి ప్రతిభ కనబరిచారు.
టీజీ ఎడ్ సెట్ ఫలితాలు - ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా:
- మొదటగా అధికారిక కన్వీనర్ వెబ్‌సైట్ https://edcet.tgche.ac.in/ ను సందర్శించాలి.
- హోంపేజీలో కనిపించే 'Download Rank Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఎడ్‌సెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
- స్క్రీన్‌పై కనిపించే మీ ర్యాంక్ కార్డును ప్రింట్ తీసుకుని, భవిష్యత్తు కౌన్సెలింగ్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

