...
...
Next Story

TG Edcet Seat Allotment : టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే

TG Edcet 2026 Seat Allotment : తెలంగాణ టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటా కింద 9,407 మందికి సీట్లు కేటాయించారు. అభ్యర్థులు ఆగస్టు 20లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Published on: Aug 17, 2026, 08:32:31 IST
Advertisement

TG Edcet 2026 Seat Allotment : బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘టీజీ ఎడ్‌సెట్’ (TG EDCET) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 9,407 మంది అభ్యర్థులకు ప్రవేశ సీట్లను కేటాయించారు. బీఈడీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను అధికారిక పోర్టల్‌లో పరిశీలించుకోవచ్చు.

రిపోర్టింగ్ తేదీలు…

టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు
టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు

సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 20, 2026 వరకు సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదట ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి, ఫీజు రసీదుతో పాటు జాయినింగ్ రిపోర్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకుని కేటాయించిన కళాశాలకు వెళ్లాలి.

అభ్యర్థులు సమర్పించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ధ్రువపత్రాల పరిశీలన విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే కళాశాల వద్దే అభ్యర్థులకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను అందజేస్తారు. నిర్దేశించిన ఆగస్టు 20వ తేదీలోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయని వారి సీటును రద్దు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు.

• కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన, రిపోర్టింగ్ : 17-08-2026 నుండి 20-08-2026 వరకు

• ఫీజు చెల్లింపు, జాయినింగ్ రిపోర్ట్ సమర్పణకు చివరి తేదీ : 20-08-2026

అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, తగిన ఆధారాలు మరియు అవసరమైన సర్టిఫికెట్లతో ముందే కళాశాలల్లో హాజరుకావాలని కన్వీనర్ సూచించారు.

TG Edcet సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ డౌన్లోడ్ ఇలా :

  1. ముందుగా https://edcetadm.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని Candidate Allotment Login Phase I లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ హాల్ టికెట్, ర్యాంక్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నింపాలి.
  4. లాగిన్ పై క్లిక్ చేస్తే మీ అలాట్ మెంట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ చాలా కీలకం.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe