TG Gurukul CET Result 2026 : గురుకులాల్లో బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TG Gurukul CET Result 2026 : తెలంగాణ గురుకుల సెట్ (బ్యాక్ లాగ్) ఫలితాలు విడుదలవుతాయి. అర్హత పొందిన వారికి 6 - 9వ తరగతిలోని ఖాళీలను భర్తీ చేస్తారు. https://tgcet.cgg.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Apr 08, 2026 1:31 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లోని బ్యాక్ లాగ్ సీట్లను భర్తీ కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ (TG Gurukul CET 2026) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5వ తరగతి ఫలితాలు రాగా… తాజాగా 6 నుంచి 9 తరగతిలోని ఖాళీలను భర్తీ చేసే పరీక్ష ఫలితాలను విడుదల చేశారు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు

ఫిబ్రవరి నెలలోనే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తి అయింది. ప్రాథమిక కీలు విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. మొత్తం ప్రాసెస్ పూర్తి కావటంతో తాజాగా ర్యాంక్ కార్డులను ప్రకటించారు.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREISల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ గురుకుల సొసైటీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. ఉచిత వసతి కల్పిస్తారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  1. ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని బ్యాక్ లాగ్ వెకెన్సీ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందొచ్చు
  6. అడ్మిషన్ ప్రాసెస్ లో ర్యాంక్ కార్డు చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

గురుకుల సెట్‌ - 2026లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను కేటాయిస్తారు. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడుతారు. ఈ సీట్లకు కొంతకాలంగా చాలా డిమాండ్ ఉంటోన్న సంగతి తెలిసిందే. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ):

ప్రశ్న: ఈ ఫలితాలు ఏ తరగతులకు సంబంధించినవి?

జవాబు: తెలంగాణ గురుకులాల్లోని 6, 7, 8 మరియు 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలివి.

ప్రశ్న: ఫలితాలను ఎక్కడ చూసుకోవాలి?

జవాబు: అధికారిక వెబ్‌సైట్ https://tgcet.cgg.gov.in/ లో మీ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు.

ప్రశ్న: సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది?

జవాబు: విద్యార్థులు ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు, వారు ఎంచుకున్న పాఠశాలతో పాటు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లను కేటాయిస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More