...
...
Next Story

TG Gurukul CET 2026 : తెలంగాణ గురుకుల ప్రవేశాలు - రెండో విడత ఫలితాలు విడుదల, ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

TG Gurukul CET 2026 Result : తెలంగాణ గురుకుల సెట్ ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించిన రెండో విడత ఫలితాలు విడుదలయ్యాయి.వీటితో పాటు 6 నుంచి 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: May 24, 2026 07:16 PM IST
Advertisement

TG Gurukul CET 2026 Result : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG Gurukul CET-2026) రెండో విడత ఫలితాలు విడుదలయ్యాయి.

తెలంగాణ గురుకుల సెట్ రెండో విడత ఫలితాలు విడుదల
తెలంగాణ గురుకుల సెట్ రెండో విడత ఫలితాలు విడుదల

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREISల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ గురుకుల సొసైటీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. ఉచిత వసతి కల్పిస్తారు. ఇప్పటికే మొదటి విడత ప్రవేశాల ఫలితాలు విడుదల కాగా…సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ కూడా పూర్తి చేశారు.

తాజాగా రెండో విడత సీట్ల ఫలితాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ బ్యాక్‌ లాగ్ సీట్ల భర్తీకి సంబంధించిన ఎంపిక జాబితాను కూడా గురుకుల విద్యా సంస్థల సొసైటీ ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:

  • ముందుగా https://tgcet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని బ్యాక్ లాగ్ వెకెన్సీ రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ స్కోర్, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందొచ్చు
  • అడ్మిషన్ ప్రాసెస్ లో ర్యాంక్ కార్డు చాలా కీలకం. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి.

సీట్లు పొందిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ (TC), మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సకాలంలో పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు.ఈ సీట్లకు కొంతకాలంగా చాలా డిమాండ్ ఉంటోన్న సంగతి తెలిసిందే. చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి 5వ తరగతి ఫలితాలు(రెండో విడత)ను చెక్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe