...
...
Next Story

TG ICET 2026 : టీజీ ఐసెట్ ప్రాథమిక కీ విడుదల - అభ్యంతరాల గడువు, ఫలితాలు ఎప్పుడంటే..?

TG ICET 2026 Preliminary Key : తెలంగాణ ఐసెట్ (TG ICET-2026) పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. నేటి నుంచి జూన్ 5 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు. జూన్ 19న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.

Published on: May 30, 2026, 14:20:14 IST
Advertisement

రాష్ట్రంలోని మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TG ICET-2026) ప్రాథమిక కీ విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్లు, కీ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ విడుదల (istock image )
టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ విడుదల (istock image )

రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కీ ని మే 29 (శుక్రవారం)వ తేదీన అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు తమ ప్రాథమిక కీ ని చెక్ చేసుకోవడానికి icet.tgche.ac.in వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

అభ్యంతరాల గడువు…

టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ లో ఏవైనా తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు గుర్తిస్తే, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఉదయం 11 గంటల నుంచి జూన్‌ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ వేదికగా మాత్రమే ఈ అభ్యంతరాలను స్వీకరిస్తారు. సరైన ఆధారాలతో నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

  • రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు.
  • ఈ ఏడాది టీజీ ఐసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ చేపట్టింది.
  • ముందే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 29న ప్రిలిమినరీ కీని విడుదల చేశారు.
  • భ్యంతరాల పరిశీలన అనంతరం జూన్‌ 19న ఐసెట్ తుది కీ (Final Key) తో పాటు ఫలితాలను కూడా విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://icet.tgche.ac.in/
  • ప్రాథమిక కీపై అభ్యంతరాలకు లింక్ - https://icet.tgche.ac.in/TGICET/TGICET_kEY_OBJ_TERMS.aspx

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe