TG ICET 2026 Key : 'టీజీ ఐసెట్ 2026 కీ' పై కీలక అప్డేట్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
TG ICET 2026 Preliminary Key : టీజీ ఐసెట్ (TG ICET 2026) ప్రాథమిక కీ మే 29న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. కీ డౌన్‌లోడ్ లింక్, అభ్యంతరాల గడువు, ఫలితాల తేదీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2026 (TG ICET-2026) రాసిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని మే 29వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విజయవంతంగా పూర్తి చేసింది.
అభ్యంతరాల స్వీకరణ
ప్రాథమిక కీలో ఏవైనా సమాధానాలపై అభ్యర్థులకు అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే, వాటిని ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలను సరైన ఆధారాలతో జతచేస్తూ వెబ్‌సైట్ ద్వారానే సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరు.
ఐసెట్ ముఖ్యమైన తేదీలు
ప్రాథమిక కీ విడుదల మే 29, 2026 (ఉదయం 11:00 గంటలకు) విడుదల చేస్తారు. ఫైనల్ కీ జూన్ 19, 2026న విడుదల అవుతుంది.
ఎంపిక విధానం, కౌన్సెలింగ్
జూన్ 19న విడుదలయ్యే ఫైనల్ కీ ఆధారంగా అభ్యర్థుల ర్యాంకులను ప్రకటిస్తారు. ఐసెట్‌లో క్వాలిఫై కావడానికి జనరల్ అభ్యర్థులకు కనీసం 25 శాతం మార్కులు రావలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. ఆ తర్వాత మార్కుల మెరిట్ ఆధారంగా త్వరలోనే వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది.
టీజీ ఐసెట్-2026 రాత పరీక్షలను మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు.
ప్రిలిమినరీ కీ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
పరీక్షకు హాజరైన అభ్యర్థులు క్రింది సాధారణ స్టెప్స్ ద్వారా కీ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
- మొదట అధికారిక వెబ్‌సైట్ icet.tgche.ac.in ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో కనిపించే 'TG ICET 2026 Preliminary Key & Response Sheet' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ ఐసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- స్క్రీన్‌పై మీ ప్రాథమిక కీ ప్రత్యక్షమవుతుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, మీ మార్కులను సరిచూసుకోండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


