...
...
Next Story

TG ICET 2026 : టీజీ ఐసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు - మే 13, 14 తేదీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్

TG ICET Applications 2026 : టీజీ ఐసెట్ - 2026 దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు లేట్ ఫీజు లేకుండానే మార్చి 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. మే 13, 14 తేదీల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి.

Published on: Mar 25, 2026 01:09 PM IST
Advertisement

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఓసారి దరఖాస్తుల గడువు పెంచగా… ఆ గడువు ఈనెల 23వ తేదీతో ముగిసింది. అయితే మరోసారి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే ఈ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ఐసెట్ 2026
తెలంగాణ ఐసెట్ 2026

తాజా ప్రకటనలోని వివరాల ప్రకారం…. అర్హులైన అభ్యర్థులు టీజీ ఐసెట్ కు మార్చి 31వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026- 2027 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ఇస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నల్ల‌గొండ‌లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

ఫైన్ తో దరఖాస్తు తేదీలు…

రూ. 500 ఫైన్ తో ఏప్రిల్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 5 వేల ఫైన్ తో మే 1, రూ. 10 వేల ఫైన్ తో మే 2,3 తేదీల్లో అప్లయ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 18 - 24వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.

మే 13, 14 తేదీల్లో ఎగ్జామ్…

టీజీ ఐసెట్ - 2026 రాత పరీక్షలను మే 13, 14 తేదీల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. సెషన్ 3 పరీక్ష మే 14, 2026 న సింగిల్ షిఫ్ట్ లో జరుగుతుంది.

ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. గత కొంతకాలంగా ఐసెట్ కు మంచి స్పందన వస్తోంది. సీట్లకు కూడా చాలా డిమాండ్ ఉంటోంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఐసెట్ - 2026కు దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe