TG ICET Counselling 2026 : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం - ఈనెల 3 నుంచి వెబ్ ఆప్షన్లు, ముఖ్య సమాచారం
TG ICET Counselling 2026 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 5 వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
TG ICET Counselling 2026 : రాష్ట్రంలోనిఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. టీజీ ఐసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఆగస్ట్ 3 నుంచి వెబ్ ఆప్షన్లు….
టీజీ ఐసెట్ ప్రవేశాల షెడ్యూల్ ప్రకారం… ఆగస్టు 1 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్దేశించిన హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఆగస్టు 3 నుండి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.
అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు 11వ తేదీన లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడిస్తారు. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 11 నుంచి 14వ తేదీ మధ్య నిర్దేశిత ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ - రిజిస్ట్రేషన్ ప్రాసెస్
- మొదటగా తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ ( https://tgicet.nic.in/default.aspx ) ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు లింక్‌పై క్లిక్ చేసి, నిర్ణయించిన రసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- ఫీజు చెల్లింపు విజయవంతమైన తర్వాత 'స్లాట్ బుకింగ్' (Slot Booking) విభాగానికి వెళ్లాలి.
- అక్కడ మీ టీజీ ఐసెట్ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలన్నీ సరిచూసుకుని సబ్మిట్ చేయడంతో ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ 2026 - ముఖ్య తేదీలు :
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు - స్లాట్ బుకింగ్ : ఆగస్టు 5, 2026 వరకు
- హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన : ఆగస్టు 1 నుండి 5వ తేదీ వరకు
- కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 3 నుండి 8వ తేదీ వరకు
- మొదటి విడత సీట్ల కేటాయింపు : ఆగస్టు 11వ తేదీ లేదా అంతకంటే ముందు
- ఫీజు చెల్లింపు & ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ : ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు
ప్రవేశాలకు సంబంధించిన మరింత సమగ్ర సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://tgicet.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు. అలాట్ మెంట్ కాపీలను కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పొందాల్సి ఉంటుంది. ర్యాంకు, రిజిర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

