తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుభవార్త తెలిపింది. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి తుది గడువును పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

వివిధ కారణాల వల్ల ఇప్పటి వరకు అడ్మిషన్లు తీసుకోలేకపోయిన పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని, వారికి మరొక విలువైన అవకాశం కల్పిస్తూ ఆగస్టు 31, 2026 వరకు ప్రవేశాల గడువును విస్తరించింది. బోర్డు జారీ చేసిన ఈ నూతన ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేటగిరీల జూనియర్ కళాశాలలకు వర్తిస్తాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ & ఎయిడెడ్ కళాశాలలు, సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు ఈ పెంచిన గడువు వర్తిస్తుంది.
గడువు సమీపించే వరకు వేచి చూడకుండా విద్యార్థులు వీలైనంత త్వరగా తమకు నచ్చిన కళాశాలల్లో సీటును ఖరారు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రవేశాల నిర్వహణలో కళాశాల యజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని కీలక మార్గదర్శకాలను టీజీబీఐఈ విడుదల చేసింది.
ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా జీపీఏ మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్గాల వారీగా రిజర్వేషన్ పద్ధతిని పక్కాగా అమలు చేయాలి.
అడ్మిషన్ పొందే సమయంలో ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు సమర్పించడంతో పాటు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని తెలిపే యాంటీ డ్రగ్ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయడం తప్పనిసరి. ప్రైవేట్ కళాశాలల్లో తరగతి గదుల రద్దీని నివారించేందుకు ఒక సెక్షన్‌కు గరిష్ఠంగా 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవడానికి అనుమతి ఉంటుంది.
అడ్మిషన్లు తీసుకునే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని బోర్డు స్పష్టం చేసింది. బోర్డు అధికారిక గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు పొందాలని సూచించింది. అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే తప్పుడు ప్రచారాలు, ఆకర్షణీయ ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా సందేహం ఉంటే టీజీబీఐఈ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}అడ్మిషన్లు తీసుకునే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని బోర్డు స్పష్టం చేసింది. బోర్డు అధికారిక గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు పొందాలని సూచించింది. అనుమతి లేని ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే తప్పుడు ప్రచారాలు, ఆకర్షణీయ ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, ఏదైనా సందేహం ఉంటే టీజీబీఐఈ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}