...
...
Next Story

TG Inter Exams 2026 : రేపట్నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ - సెంటర్లలో సీసీ కెమెరాలు..!

రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రేపట్నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. అన్నీ ప్రాక్టికల్‌ కేంద్రాల్లో 6 నుంచి 8 సీసీ కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు.

Published on: Feb 01, 2026 01:31 PM IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల కోసం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సుమారు 3.40 లక్షల మంది హాజరవుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,440 కేంద్రాలను ఏర్పాటు చేయగా… ఆయా కేంద్రాల్లో 6 నుంచి 8 సీసీ కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించేలా అనుసంధానం చేశారు.

ఎంపీసీ విద్యార్థులు 2,74,007 మంది, బైపీసీ విద్యార్థులు 1,33,415 మంది ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఇక ఒకేషనల్‌ విద్యార్థులు మరో 1,18,770 మంది ఈ పరీక్షలు రాస్తారు. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 7,559 మంది ఎగ్జామినర్లను నియమించారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు…

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు చదివే ఆయా కళాశాలల లాగిన్‌లో వీటిని అందుబాటులో ఉంచింది. కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించి ఈ హాల్‌టికెట్లు పొందవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. హాల్ టికెట్ల విషయంలో విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9240205555 అనే టోల్‌ఫ్రీ నంబర్ ను సంప్రదించవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.

ఇక థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీతో ప్రారంభమవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ పరీక్షలన్నీ కలిపి మార్చి 18వ తేదీతో ముగుస్తాయి. ఇప్పటికే థియరీ పరీక్షల ఫ్రివ్యూ(నమూనా) హాల్ టికెట్లను కూడా అందుబాటులో ఉంచారు. ప్రాక్టికల్ పరీక్షలు ముగియగానే… తుది హాల్ టికెట్లను విడుదల చేస్తారు.

TG Inter ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

  • 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
  • 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
  • 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
  • 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
  • 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
  • 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
  • 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

TG Inter సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:

  • 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
  • 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
  • 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
  • 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
  • 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
  • 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
  • 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
  • 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe