TG EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఫైనల్ ఫేజ్ సీట్లు కేటాయింపు, అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ - 2025 ఫైనల్ సీట్లను కేటాయించారు. ఆయా విద్యార్థులు https://tgeapcetb.nic.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈనెల 23లోపు రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

Published on: Oct 21, 2025, 16:03:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో బీఫార్మసీ, ఫార్మాడీ బీటెక్‌ బయోమెడికల్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగియగా… ఇవాళ ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించారు.

టీజీఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు
టీజీఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ సీట్ల కేటాయింపు

ఈ ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందే విద్యార్థులు ఈనెల 21 నుంచి 22 తేదీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఈనెల 24 నాటికి ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుంది.

అలాట్ మెంట్ కాపీ డౌన్లోడ్ ప్రాసెస్ :

  1. విద్యార్థులు ముందుగా https://tgeapcetb.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్ వివరాలతో లాగిన్ కావాలి.
  4. మీకు ఏ కాలేజీలో సీటు కేటాయించారనేది డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో అలాట్ మెంట్ కాపీ అతి ముఖ్యమైనది.

స్మాట్ అడ్మిషన్లు ఎప్పుడంటే..?

టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ స్పాట్ అడ్మిషన్లపై కూడా అధికారులు అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ ఫేజ్ రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి కాగానే స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఈనెల 23వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ అవుతాయని అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లోని మిగిలిన సీట్లను భర్తీ చేస్తారు.

మీవద్ద ఉండాల్సిన పత్రాలు:

  • TGEAPCET -2025 ర్యాంక్ కార్డు
  • టీజీ ఈఏపీసెట్ హాల్ టికెట్
  • ఆధార్ కార్డు
  • టెన్త్ మెమో
  • ఇంటర్ మెమో
  • ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • టీసీ
  • ఆదాయపు ధ్రువీకరణపత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • రెసిడెన్సీ సర్టిఫికెట్
  • ఇతర పత్రాలు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More