TS Inter Supplementary Exams 2026 : విద్యార్థులకు అలర్ట్ - మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

TS Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. అయితే సప్లిమెంటరీ ఫలితాలు మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది.

Published on: Apr 12, 2026, 11:37:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TS Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు బోర్డు నుంచి అప్డేట్ వచ్చేసింది.ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే షెడ్యూల్ ను ప్రకటిస్తామని పేర్కొంది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ పరీక్షలు

మే 22వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్(సప్లిమెంటరీ) పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలు ఫీజు చెల్లింపు ప్రక్రియ ఏప్రిల్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు.

తాజాగా విడుదలైన ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి విద్యార్థులు… రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు రీ-వెరిఫికేషన్‌లో మార్పు లేదని భావిస్తే…. మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై స్కోరును మెరుగుపరుచుకోవచ్చు.

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,123 మంది ఇంటర్ ఫస్టియర్, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

2026 ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (82.34%), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (82.16%) నిలిచాయి. ములుగు జిల్లా 82.12 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆన్‌లైన్ మెమోలో పేరు, గ్రూపు లేదా మార్కులలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు ప్రిన్సిపాల్ ద్వారా లేదా బోర్డు హెల్ప్‌డెస్క్‌కు (helpdesk-ie@telangana.gov.in) ఫిర్యాదు చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను బోర్డు స్వీకరించదు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More