...
...
Next Story

విదేశీ విద్యానిధి పథకం కోసం దరఖాస్తులు పొడిగింపు.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్

తెలంగాణలో బీసీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్య కోసం ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 14, 2026, 17:29:59 IST
Advertisement

తెలంగాణలో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు కంటున్న వెనకబడిన తరగతులు(బీసీ), ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈబీసీ) విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఓవర్సిస్ స్కాలర్‌షిప్
తెలంగాణ ఓవర్సిస్ స్కాలర్‌షిప్

2026 ఫాల్ సెషన్‌లో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ పొడిగించిన గడువును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఈ దరఖాస్తు ప్రక్రియ, అక్టోబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది.

అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు లేక విదేశీ విద్యకు దూరమవుతున్న ప్రతిభావంతులైన బీసీ, ఈబీసీ విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(PG/Masters), పీహెచ్‌డీ కోర్సులు చేయాలనుకునే అభ్యర్థులకు ప్రభుత్వం రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. దీనితోపాటు విమాన టికెట్ ఛార్జీలు, వీసా రుసుములలో సడలింపులు కూడా లభిస్తాయి.

డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్‌లో అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం అన్ని మార్గాల ద్వారా రూ. 5 లక్షలలోపు ఉండాలి(మీసేవ ద్వారా పొందిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి).

అర్హత కలిగిన బీసీ, ఈబీసీ అభ్యర్థులు తెలంగాణ ఈ పాస్(Telangana ePASS) అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపే సమయంలో ఎస్ఎస్సీ మార్కుల మేమో, డిగ్రీ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ కాపీ, విదేశీ యూనివర్సిటీ ఆఫర్ లెటర్, స్కోర్ కార్డ్‌లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

విదేశాల్లో ఉన్నత విద్య ద్వారా మెరుగైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలనుకునే అర్హులైన విద్యార్థులందరూ అక్టోబర్ 31, 2026 సాయంత్రంలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా.. వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks