...
...
Next Story

TG PGECET 2026 : టీజీ పీజీఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 27 నుంచి దరఖాస్తులు

TG PGECET Notification 2026 : టీజీ పీజీఈసెట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 27వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 28 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయి.

Published on: Feb 25, 2026, 10:04:14 IST
Advertisement

తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీజీ పీజీఈసెట్‌)-2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. 2026 - 2027 విద్యా సంవత్సరానికి గాను ఎంఈ, ఎంటెక్‌, ఎం ఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీజీ పీజీఈసెట్ 2026
టీజీ పీజీఈసెట్ 2026

TG PGECET - 2026 ప్రవేశ పరీక్షను హైదరాబాద్ జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.మే 19వ తేదీ నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మే 28 నుంచి 31 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

టీజీ పీజీఈసెట్‌ 2026 - ముఖ్య వివరాలు

ఎంట్రెన్స్ ఎగ్జామ్ - తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, 2026.

కోర్సులు - ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌.డి

బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - 27 ఫిబ్రవరి 2026

అప్లికేషన్ ఫీజు - జనరల్ అభ్యర్థులకు రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600).

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600).

రూ.250 ఆలస్య రుసుముతో మే 9 వరకు దరఖాస్తుకు అవకాశం.

రూ.1,000 ఆలస్య రుసుముతో మే 12వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం.

రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం.

రూ.5,000 ఆలస్య రుసుముతో మే 18వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

రూ.10,000 ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తుకు అవకాశం.

అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - మే 9 నుంచి 10వ తేదీ వరకు అవకాశం.

హాల్‌టికెట్ డౌన్లోడ్ - మే 19వ తేదీ

పరీక్షలు - మే 28 నుంచి 31 వరకు

టీజీ PGECET ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. 120 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగటివ్‌ మార్కు ఉండదు.

ఎంట్రెన్స్ టెస్టులో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టి సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను ప్రకటిస్తారు. ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe