...
...
Next Story

TG POLYCET 2026 : టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - మే 13న 'పాలిసెట్‌' ఎగ్జామ్ ..!

టీజీ పాలిసెట్ - 2026పై అప్డేట్ వచ్చేసింది. మే 13వ తేదీన ఎగ్జామ్ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారం రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.

Published on: Jan 31, 2026 11:23 AM IST
Advertisement

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ పరీక్షపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈసారి మే 13వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. టెన్త్ పాస్ అయిన వారితో పాటు ప్రస్తుతం పరీక్షలు రాసే విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు.

ఈ వారంలో నోటిఫికేషన్….

తెలంగాణ పాలిసెట్ 2026
తెలంగాణ పాలిసెట్ 2026

టీజీ పాలిసెట్ - 2026 నోటిఫికేషన్ ఈ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా మండలి కసరత్తు చేస్తోంది. గతేడాది ఈ పరీక్ష కోసం లక్ష మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా… ఈసారి దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు గతేడాది ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్‌ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు.

4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్‌గా పరిగణిస్తారు. నాన్‌లోకల్‌ కోటా కింద.. పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.

టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe