...
...
Next Story

TG POLYCET Results 2026 : తెలంగాణ పాలిసెట్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే..?

TG POLYCET Key Results 2026 : తెలంగాణ పాలిసెట్ 2026 ప్రాథమిక కీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఫలితాలను కూడా ప్రకటించనున్నారు.

Published on: May 18, 2026, 13:50:55 IST
Advertisement

TG POLYCET Key Results 2026 :తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిజీ పాలిసెట్ (TG POLYCET-2026) రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ (Preliminary Key)ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను ఈ కీతో సరిచూసుకోవచ్చు.

తెలంగాణ పాలిసెట్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే..?
తెలంగాణ పాలిసెట్ కీ విడుదల - ఫలితాలు ఎప్పుడంటే..?

ఈ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చరల్ యూనివర్సిటీల పరిధిలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీజీ పాలిసెట్ ప్రిలిమినరీ కీ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • ముందుగా https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ప్రాథమిక కీ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ నేరుగా పీడీఎఫ్ డిస్ ప్లే అవుతుంది. ఇక్కడ నాలుగు సెట్ల ప్రాథమిక కీలు ఉంటాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందొచ్చు.

త్వరలోనే పాలిసెట్ ఫలితాలు

టీజీ పాలిసెట్ - 2026 ప్రాథమిక కీ విడుదల కావడంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యంతరాలను కూడా స్వీకరించారు. వీటిని పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… మే 26 లేదా 27 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ తేదీలు మిస్ అయితే… మే చివరి కల్లా అయినా రిజల్ట్స్ ప్రకటిస్తారు. టీజీ పాలిసెట్ లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించి…. సీట్ల భర్తీని పూర్తి చేస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks