TG SAFE : అందుబాటులోకి టీజీ-సేఫ్.. ఆహారం, ఔషధాల సేఫ్టీ చెకింగ్‌కు ఒకే సిస్టమ్

TG SAFE : తెలంగాణలో టీజీ-సేఫ్ అందుబాటులోకి వచ్చింది. ఆహారం, ఔషధాల నాణ్యతకు ఒకే గొడుగు కింద పటిష్టమైన వ్యవస్థ తీసుకువచ్చింది ప్రభుత్వం.

Published on: Aug 17, 2026, 22:01:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రజల ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్(TG-SAFE) వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

'ఆహారం, ఔషధాల నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ఒకే విభాగంగా రూపుదిద్దుకున్న టీజీ-సేఫ్ నేటి నుంచి అమల్లోకి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సురక్షితమైన తెలంగాణ రూపకల్పనలో పౌరులందరూ ఈ సేవలను వినియోగించుకోవాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రజారోగ్యం, వినియోగదారుల రక్షణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలన, చట్టబద్ధమైన నిబంధనల అమలులో ఆహార భద్రతా విభాగం (Food Safety Dept), డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఒకే విధమైన లక్ష్యాలను కలిగి ఉన్నాయి.

నిఘా, సమాచార సేకరణ, చట్టపరమైన సహకారం, తనిఖీల వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ రెండింటినీ కలిపి ఒకే పరిపాలనా పరిధిలోకి తీసుకురావడం అత్యవసరమని ప్రభుత్వం భావించింది.

టీజీ-సేఫ్ పరిధిలోకి విలీనమైనప్పటికీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 లోని చట్టబద్ధ నిబంధనలు యథాతథంగా అమలులో ఉంటాయి. ఈ కొత్త విభాగానికి కమిషనర్ పూర్తి స్థాయి పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు. గతంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతిని టీజీ-సేఫ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఆహార భద్రతా విభాగం, ఔషధ నియంత్రణ విభాగాన్ని టీజీ సేఫ్ అనే ఏకీకృత పరిపాలన కింద విలీనం చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆహార భద్రత మరియు ఔషధ నియంత్రణ విభాగాలకు టీజీ సేఫ్ కమిషనర్ ఏకీకృత పరిపాలనా నియంత్రణగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More