తెలంగాణ సెట్ ఎగ్జామ్ - 2025 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త షెడ్యూల్ ప్రకారం…. ఈనెల 22, 23, 24 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
టీజీ సెట్ - 2025 హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా…
- అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టీజీ సెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

డిసెంబర్ 22వ తేదీన ఉదయం ఒక సెషన్ లో కొన్ని సబ్జెక్టులు, మధ్యాహ్నం జరిగే రెండో సెషన్ లో మరికొన్నిసబ్జెక్టుల పేపర్లు జరుగుతాయి. మొదటి రోజు జియాగ్రఫీ, జర్నలిజం,సంస్కృతం, హిందీ, లైఫ్ సైన్సెస్ పేపర్లు నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉర్దూ, తెలుగు, ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్ ఉంటాయి. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి షెడ్యూల్ చూడొచ్చు.
ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది.
టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి.
{{/usCountry}}ఈ పేపర్లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి.
{{/usCountry}}