TG SET 2025 : టీజీ సెట్ ప్రాథమిక కీలు విడుదల - త్వరలోనే ఫలితాలు..!

టీజీ సెట్ - 2025 ప్రాథమి కీలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా వెబ్ సైట్ లో ఉంచారు. త్వరలోనే సెట్ ఫలితాలను ప్రకటించనున్నారు. 

Published on: Jan 15, 2026, 07:41:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ సెట్ - 2025 పరీక్ష తేదీలపై మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే పరీక్షలు పూర్తి అయిన నేపథ్యంలో… వాటికి సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు.. ప్రిలిమినరీ కీలను చూసుకోవచ్చు.

టీజీ సెట్
టీజీ సెట్

టీజీ సెట్ ప్రిలిమినరీ కీ - ఇలా చెక్ చేసుకోండి

  • టీజీ సెట్ - 2025 అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలోని మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మొత్తం 20 సబ్జెక్టుల పేపర్లు కనిపిస్తాయి. వాటి పక్కనే డౌన్లోడ్ లింక్ ఉంటుంది.
  • డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేస్తే మీకు ప్రిలిమినరీ కీ ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా పీడీఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

త్వరలో ఫలితాలు…!

గతేడాది డిసెంబర్ నెలలోని 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా… ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే టీజీ సెట్ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీఎస్ సెట్ ఫలితాలతో పాటు ఇతర అప్డేట్స్ కోసం http://telanganaset.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు

ఈ టీజీ సెట్ -2025ను రెండు పేపర్లలో నిర్వహించారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులంటాయి. వీటిలో అభ్యర్థులు సాధించే మెరిట్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారు. ఓపెన్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్ స్కోర్ ను నిర్ణయించి.. అర్హత సాధించిన వారికి మాత్రమే సెట్ పత్రాలను అందజేస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More