TG SET 2026 Applications : టీజీ సెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఫైన్ లేకుండా దరఖాస్తుకు మరికొన్ని గంటలే గడవు!

TG SET 2026 Applications : టీజీ సెట్ 2026 పరీక్షకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవాలని అధికారులు కోరారు.

Published on: Sep 5, 2026, 15:01:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TG SET 2026 Applications : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మరియు లెక్చరర్లుగా అర్హత సాధించడానికి నిర్వహించే 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG SET - 2026) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 5, 2026 (నేడు) చివరి తేదీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక సమస్యల బారిన పడకుండా వెంటనే https://telanganaset.org/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

టీజీ సెట్ అభ్యర్థులకు అలర్ట్
టీజీ సెట్ అభ్యర్థులకు అలర్ట్

ఆలస్య రుసుముతో దరఖాస్తు షెడ్యూల్ ఇలా….

ఒకవేళ అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లయ్ చేసుకోలేకపోతే, అదనపు రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

రూ. 1500 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 8 వరకు, రూ. 2000 ఆలస్య రుసుముతోసెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 10 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక రూ. 3000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్ టికెట్లు ఎప్పుడంటే..?

దరఖాస్తుల్లో నమోదు చేసిన వివరాలలో ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 15 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులలో సవరణలు చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను సెప్టెంబర్ 24, 2026 నుండి అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ స్పష్టం చేశారు.

టీజీ సెట్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలను (CBT) సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీలలో నిర్వహించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహిస్తారు.

ఈ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.

  • పేపర్-1 : సాధారణ జ్ఞానం, బోధనా నైపుణ్యాలు మరియు పరిశోధనా పటిమను (General Awareness, Teaching & Research Aptitude) పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు.
  • పేపర్-2 : అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. ఈ రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
  • పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం ఇస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More