TG SET 2026 Exam Schedule : తెలంగాణ సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - సబ్జెక్టుల వారీగా వివరాలివే
TG SET 2026 Exam Schedule : తెలంగాణ సెట్ (TG-SET) 2026 పరీక్షల సబ్జెక్టుల వారీ షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి.
TG SET 2026 Exam Schedule : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే ‘తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష’ (టిజి-సెట్ 2026) సబ్జెక్టుల వారీ పరీక్షల షెడ్యూల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఈనెల 24 నుంచి హాల్ టికెట్లు…
ఈ సారి కూడా TG-SET పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT Mode) నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాల వివరాలను హాల్ టికెట్లలోనే పొందుపరుస్తామని ఆయన తెలిపారు.
సబ్దెక్టుల వారీగా షెడ్యూల్ ఇలా :
- సెప్టెంబర్ 28, 2026 (సోమవారం) : షిఫ్ట్-1: జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్, సంస్కృతం. షిఫ్ట్-2: ఎడ్యుకేషన్, లింగ్విస్టిక్స్, తెలుగు, ఉర్దూ.
- సెప్టెంబర్ 29, 2026 (మంగళవారం):షిఫ్ట్-1: కామర్స్, హిస్టరీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్‌మెంట్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, సోషియాలజీ. షిఫ్ట్-2: ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
- సెప్టెంబర్ 30, 2026 (బుధవారం):షిఫ్ట్-1: కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్. షిఫ్ట్-2: కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఇంగ్లీష్, లా .
పరీక్షా విధానం…
- ఈ అర్హత పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షను రెండు విభాగాలుగా నిర్వహిస్తారు.
- పేపర్-1 : సాధారణ జ్ఞానం, బోధనా నైపుణ్యాలు మరియు పరిశోధనా పటిమను (General Awareness, Teaching & Research Aptitude) పరీక్షించే విధంగా ఉంటుంది. ఇందులో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు.
- పేపర్-2 : అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు ఆధారంగా ఉంటుంది. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు. ఈ రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
- పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల (180 నిమిషాలు) సమయం ఇస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

