Telangana SET Online Applications 2026 : విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు నిర్వహించే 'తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్' ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరటనిస్తూ దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థులు టీజీ సెట్ అధికారిక వెబ్‌సైట్‌లు https://tgset.aptonline.in/ లేదా https://telanganaset.org/ సందర్శించి వెంటనే తమ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థుల హాల్ టికెట్లను అందుబాటులోకి తెస్తారు.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
టీజీ సెట్ - పరీక్షా విధానం :
- టీజీ సెట్-2026 పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి:
- పేపర్-1 : సాధారణ జ్ఞానం, బోధనా, పరిశోధనా నైపుణ్యాలను పరిశీలించేలా 50 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు.
- పేపర్-2 : అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయించారు.
- రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష రాయడానికి అభ్యర్థులకు మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.