...
...
Next Story

TG SET 2026 Notification : తెలంగాణ సెట్ నోటిఫికేషన్ అప్డేట్ - నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, ముఖ్య తేదీలు

TG SET 2026 Notification Updates : ఇవాళ్టి నుంచి 'టీజీ సెట్ - 2026' ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. https://tgset.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.

Published on: Aug 3, 2026, 05:12:40 IST
Advertisement

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET 2026) నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కాగా… ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నేటి(ఆగస్ట్ 3, 2026) నుంచి ప్రారంభం కానుంది. డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉన్నత విద్యా రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

దరఖాస్తు తేదీలు…

తెలంగాణ సెట్ - 2026 దరఖాస్తులు
తెలంగాణ సెట్ - 2026 దరఖాస్తులు

అభ్యర్థులు ఎటువంటి అదనపు ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోలేని వారికి ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు.

  • రూ. 1500 ఆలస్య రుసుముతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశమిచ్చారు.
  • రూ. 2000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ. 3000 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తుకు చివరి అవకాశం కల్పించారు.
  • సర్పించి వివరాల్లో ఏవైనా తప్పులుంటే దిద్దుకునేందుకు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
  • సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.
  • సెప్టెంబర్ చివరి వారంలో ఈ అర్హత పరీక్షలు నిర్వహిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://telanganaset.org/

ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించే సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల దిద్దుబాటు అందుబాటులో ఉంటుంది.

టీజీ సెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు (100 మార్కులు), పేపర్-2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి. రెండింటికీ కలిపి మొత్తం 3 గంటల వ్యవధి ఇస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe