TG Ration Card Application Status : కొత్త రేషన్ కార్డుల అప్డేట్ - మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Telangana Ration Card Application Status Check : తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ, మంజూరు ప్రక్రియ సాగుతోంది. మీసేవా కేంద్రంలో అప్లై చేసుకున్న వారు మీ మొబైల్‌లోనే అప్లికేషన్ స్టేటస్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. 

Published on: Aug 2, 2026, 12:42:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Ration Card Application Status Check : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) మంజూరు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కీలకమైన ఆహార భద్రతా కార్డుల జారీపై ప్రత్యేక దృష్టి సారించింది.

ప్రజాపాలనలో రేషన్ కార్డు దరఖాస్తులు (ఫైల్ ఫొటో)
ప్రజాపాలనలో రేషన్ కార్డు దరఖాస్తులు (ఫైల్ ఫొటో)

అర్హులైన పౌరులు సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటికే అప్లై చేసుకున్న చాలా మందికి అధికారులు పరిశీలన పూర్తి చేసి కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు.

అయితే దరఖాస్తు చేసుకున్న పౌరులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి పౌరసరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు తమ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు - స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

  • ముందుగా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపిస్తున్న 'FSC Search' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • కొత్తగా ఓపెన్ అయ్యే విండోలో 'FSC Application Search' (ఎఫ్‌ఎస్‌సి అప్లికేషన్ సెర్చ్) అనే ఆప్షన్‌పై నొక్కాలి.
  • మొదట మీ జిల్లాను డ్రాప్‌డౌన్ జాబితా నుంచి ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వద్ద ఉన్న మీసేవా అప్లికేషన్ నంబర్‌ను (MeeSeva Application Number) నిర్ణీత బాక్స్‌లో సరిగ్గా టైప్ చేయాలి.
  • చివరగా 'Search' (సెర్చ్) బటన్‌పై నొక్కిన వెంటనే మీ దరఖాస్తు ప్రస్తుత స్థితి స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
  • అధికారులు మీ దరఖాస్తును ఆమోదించినట్లయితే (Approved) అని ఉంటుంది. కుటుంబ యజమాని పేరుతో పాటు రేషన్ కార్డులో చేర్చిన కుటుంబ సభ్యుల వివరాలన్నీ డిస్‌ప్లే అవుతాయి.
  • ఇంకా పరిశీలన పూర్తి కానట్లయితే లేదా అధికారులు నిర్ణయం తీసుకోకపోతే 'Pending' లేదా 'Under Process' అని కనిపిస్తుంది.

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క నెలకు విడివిడిగా కాకుండా…. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందజేస్తోంది. ఈ ఆగస్టు 1వ తేదీ నుంచే ఈ మూడు నెలల బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.

ఈకేవైసీ గడువు పొడిగింపు…

మరోవైపు రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఆహార భద్రత కార్డులో ఉన్న సభ్యుల వివరాలను ఆధార్ కార్డుతో అనుసంధానించే ఈ-కేవైసీ (eKYC) ప్రక్రియ సమయాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించారు.

రేషన్ షాపుల్లో ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో కూడా ఆధార్ ధృువీకరణ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డుతో పాటు, అందులో నమోదైన సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. దీని కోసం రేషన్ డీలర్లకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More