Telangana MeeSeva : డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా 'మీసేవా' కేంద్రాలు - సేవలు ఎలా పొందాలంటే?
మెటా సంస్థ భాగస్వామ్యంతో మీసేవా కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా సేవలందించనున్నాయి. చిన్న వ్యాపారులు ఇకపై తమ సమీప మీసేవా కేంద్రాల ద్వారా సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం స్థానిక వ్యాపారులకు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) - మీసేవా ద్వారా… 'మెటా' (Meta) భాగస్వామ్యంతో రాష్ట్రంలోని మీసేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మారుస్తూ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అత్యంత తక్కువ ఖర్చుతోనే డిజిటల్ మార్కెటింగ్ సేవలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.

ఈ ప్రత్యేక చొరవలో భాగంగా క్యూర్ ఏరియాకు చెందిన 150 మందికి పైగా మీసేవా విలేజ్ లెవల్ ఆంత్రప్రెన్యూర్లకు హైదరాబాద్ వేదికగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెటా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రకటనలను ఎలా తయారు చేయాలి..? వాటిని లక్ష్యిత వినియోగదారులకు ఏ విధంగా చేర్చాలి..? అనే విషయాలపై సమగ్ర శిక్షణ ఇచ్చారు.
ప్రకటనల డిజైనింగ్, ప్రమోషనల్ కంటెంట్ తయారీ, సరైన ఆడియెన్స్‌ను ఎంచుకోవడం, డిజిటల్ క్యాంపెయిన్ల నిర్వహణలో వీఎల్ఈలకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. ఈ నిర్ణయం వ్యాపారులకు మేలు చేయడమే కాకుండా, మీసేవ నిర్వాహకులకు డిజిటల్ మార్కెటింగ్ రూపంలో అదనపు ఆదాయ మార్గాన్ని కూడా తెచ్చిపెడుతుంది.
ఏ వ్యాపారమైనా ప్రచారం….
ఈ నూతన విధానం ద్వారా ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాన్ని డిజిటల్ స్థాయిలో ప్రచారం చేసుకోవచ్చు. వీధి చివర ఉండే కిరాణా కొట్టు, పండ్ల దుకాణం, స్వీట్ షాప్, రెస్టారెంట్, మెడికల్ షాప్, ప్రైవేటు ఆసుపత్రి, పాఠశాల, బ్యూటీ సెలూన్/స్పా, మెకానిక్ షెడ్, ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్ సేవల నుంచి మొదలుకొని స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద వ్యాపార సంస్థల వరకు ఎవరైనా సరే తమ సమీపంలోని మీసేవా కేంద్రానికి వెళ్లి… ప్రకటనలను సిద్ధం చేసుకోవచ్చు.
మీసేవా ఆపరేటర్లే స్వయంగా అడ్వర్టైజ్మెంట్ క్రియేటివ్స్ తయారు చేయడం, సరైన కస్టమర్లను ఎంచుకోవడం, ఆడ్ క్యాంపెయిన్‌లను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్‌ఫామ్‌లలో పబ్లిష్ చేయడం వంటి ప్రక్రియల్లో పూర్తిగా సహాయం అందిస్తారు. దీంతో వ్యాపారులకు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ మంది కస్టమర్లు లభించి….. అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో ఈఎస్‌డీ (మీసేవా) కమిషనర్ టి. రవికిరణ్ మాట్లాడుతూ… సాంకేతిక పరిజ్ఞానం ద్వారా స్థానిక పారిశ్రామికవేత్తలను సాధికారత వైపు నడిపించాలనే తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు ఈ భాగస్వామ్యమే నిదర్శనమని పేర్కొన్నారు. మెటా సంస్థకు ఉన్న అంతర్జాతీయ డిజిటల్ మార్కెటింగ్ అనుభవాన్ని, తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన మీసేవా నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా, ఇదివరకు డిజిటల్ ప్రచారానికి దూరంగా ఉన్న గ్రామీణ, చిన్న వ్యాపారాలకు కూడా నాణ్యమైన మార్కెటింగ్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

