తెలంగాణ నుంచి అదనంగా ధాన్యం కొనుగోళ్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రైతులకు ఉపశమనం కలగనుంది.

Published on: Jul 22, 2026, 16:01:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో రబీ (యాసంగి) సీజన్‌కు సంబంధించి అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైతులకు ఎంతో మేలు చేకూర్చే ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.

ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్లు

సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం సేకరణ కోటాను గణనీయంగా పెంచింది. కొత్తగా పెంచిన పరిమాణం వలన ధాన్యం కొనుగోలు కోటా 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 8 లక్షల మెట్రిక్ టన్నులను తెలంగాణ నుంచి అదనంగా సేకరించనుంది. ఈ నిర్ణయంతో రబీ ధాన్యాన్ని విక్రయించేందుకు నిరీక్షిస్తున్న వేలాది మంది రైతులకు కనీస మద్దతు ధర లభించనుంది.

తొలుత కేంద్రం 35 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితిని విధించినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రావడం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంలో తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు కీలక పాత్ర పోషించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలుమార్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. రబీ పంట సేకరణ పరిమితిని పెంచాలని ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.

కోటా పెంపునకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కొద్ది నెలలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత, గన్నీ బ్యాగుల కొరత, వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలపై తీవ్ర చర్చ జరిగింది. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం కూడా ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇప్పుడు అదనపు ధాన్యం కొనుగోలుకు అంగీకరించడంతో రైతుల వద్ద పేరుకుపోయిన నిల్వల సేకరణ శరవేగంగా పూర్తవుతుందని ఆశిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More