...
...
Next Story

TG TET 2026 : టీజీ టెట్ హాల్ టికెట్లపై అప్డేట్ - డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా

టీజీ టెట్ 2026 పై అప్డేట్ వచ్చేసింది. శనివారం(డిసెంబర్ 27) నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి.

Published on: Dec 26, 2025 02:34 PM IST
Advertisement

తెలంగాణ టెట్ - 2026 హాల్ టికెట్లపై అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… రేపట్నుంచి(డిసెంబర్ 27) హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను పొందవచ్చు.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2026
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు 2026

ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు.

టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు - డౌన్లోడ్ ఇలా

  1. ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ‘హాల్ టికెట్ డౌన్లోడ్’ ఆప్షన్ పై నొక్కాలి.
  3. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  6. పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు జరుగుతాయి. మెుదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ టెట్ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ ఎగ్జామ్ లో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

టీజీ టెట్ పరీక్షల షెడ్యూల్ ఇలా….

  • జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : హన్మకొండ, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జనగాం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్ అభ్యర్థులకు నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, నారాయణపేట అభ్యర్థులకు ఉంటుంది.
  • జనవరి 4న మొదటి సెషన్‌ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : మంచిర్యాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్‌ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష : యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, వికారాబాద్, వనపర్తి, ఆదిలాబాద్, వరంగల్, జగిత్యాల వారికి ఉంటుంది.
  • జనవరి 5న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, పెద్దపల్లి అభ్యర్థులకు ఉంటుంది. రెండో సెషన్ : కరీంనగర్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగువారికి నిర్వహిస్తారు.
  • జనవరి 6న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 : నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, వికారాబాద్, ఇతరాలు, నిజామాబాద్. రెండో సెషన్ : యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వరంగల్, వనపర్తి, సిద్దిపేట, సూర్యాపేట అభ్యర్థులకు ఉంటుంది.
  • జనవరి 8న మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, మేడ్చల్ మల్కాజిగిరి, వనపర్తి. రెండో సెషన్ : హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి వారికి నిర్వహిస్తారు.
  • జనవరి 9న మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : వికారాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్.
  • జనవరి 11 మొదటి సెషన్ పేపర్ 1 పరీక్ష : ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, హైదరాబాద్, జగిత్యాల అభ్యర్థులకు ఉండగా.. రెండో సెషన్ : మహబూబాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జనగాం, నిర్మల్, జోగులాంబ గద్వాల్ అభ్యర్థులకు ఉంటుంది.
  • ఇక జనవరి 19వ తేదీన మెుదటి సెషన్‌లో పేపర్ 1(మైనర్) పరీక్ష.. అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ మీడియంలో వారికి ఉంటుంది. జనవరి 20వ తేదీన మెుదటి సెషన్ పేపర్ 2(మైనర్) పరీక్ష మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు జరుగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe