...
...
Next Story

తెలంగాణ టెట్ - 2026 : ఇవాళ్టి నుంచే దరఖాస్తులు ప్రారంభం - ఇలా అప్లయ్ చేసుకోండి

టీజీ టెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. నవంబర్ 29వ తేదీ వరకు అప్లికేషన్లకు అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పరీక్షలు జరుగుతాయి.

Published on: Nov 15, 2025, 09:55:52 IST
Advertisement

తెలంగాణ టెట్ - 2026(జనవరి) నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలనే షెడ్యూల్ విడుదల కాగా…. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం శుక్రవారం పూర్తిస్థాయి నోటిఫికేషన్ అందుబాటులోకి ఉంటుంది. ఇక ఇవాళ్టి నుంచే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 29వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు - ముఖ్యమైన తేదీలు

తెలంగాణ టెట్ - 2026
తెలంగాణ టెట్ - 2026

అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.

వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా… మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్రతి సెషన్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. ఇక తెలంగాణ టెట్ - 2026 ఫలితాలను ఫిబ్రవరి 10-16 తేదీల మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…

  1. అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుంది.
  4. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. మీ వివరాలను నమోదు చేయాలి.
  5. మీ ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  6. చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీకు అప్లికేషన్ నెంబర్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  7. ఈ నెంబర్ ఆధారంగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు.

ఇక ఈ టెట్ ఎగ్జామ్ ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. మరోవైపు ఈసారి కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(EWS) కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పటివరకు జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మాత్రమే ఉండేవి. ఈడబ్ల్యూఎస్‌ విభాగంలోనూ జనరల్‌ కేటగిరీ మాదిరిగానే 60 శాతం ఆపైన వస్తేనే ఉత్తీర్ణులవుతారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe