టీచర్ అభ్యర్థులకు అలర్ట్ - తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపు ప్రక్రియ నవంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన పరీక్షలు జనవరి 3,2026 నుంచి జనవరి 31 వరకు జరుగుతాయి.
టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ టెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఉదయం 9.00 గంటల నుంచి 11.30 గంటలకు వరకు మొదటి సెషన్ ఉండగా… మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ప్రతి సెషన్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ టీచర్లంతా రాయాల్సిందేనా…!
ఈ టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు నవంబర్ 14వ తేదీన అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వం టీచర్లు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని ఇటీవలే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అందుబాటులో ఉంచే పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ లో ఎలాంటి క్లారిటీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జూన్ నోటిఫికేషన్ పూర్తి అయింది. దీంతో తాజాగా విద్యాశాఖ ఈ కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది.
మరోవైపు టెట్ ఎగ్జామ్ పై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో…. వీరంతా కూడా ఎగ్జామ్ రాయాల్సి పరిస్థితి ఏర్పడింది. వీరి సంఖ్య 45 వేలకుపైగా ఉంటుందని అంచనా. వీరి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లబోతుందనేది చూడాలి.
టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు.ఇక ఈ టెట్ ఎగ్జామ్ ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

