TG TET Exams 2026 : రేపట్నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
టీజీ టెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభమవుతాయి. జనవరి 20వ తేదీ వరకు 9 రోజుల్లో 15 సెషన్లలో జరగనున్నాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
తెలంగాణ టెట్ జనవరి-2026 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ పరీక్షలు జనవరి 3వ తేదీన ప్రారంభమైం… జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. అంటే 9 రోజుల్లో 15 సెషన్లలో పరీక్షలను పూర్తి చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు.
అభ్యర్థులకు కీలక సూచనలు :
- అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ కి ముందుగానే చేరుకోవాలి. గంటన్నర ముందే నుంచే అభ్యర్థులను అనుమతిస్తారు.
- గేట్లను క్లోజ్ చేసిన తర్వాత అభ్యర్థులను అనుమతించరు.
- అభ్యర్థులు తప్పని సరిగా హాల్ టికెట్ ను తీసుకెళ్లాలి.
- ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి.
- ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రం లోపలికి తీసుకెళ్లడానికి వీలు లేదు.
- హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులో వివరాలను సరి చూసుకోవాలి.
- హాల్‌టికెట్‌పై ఫొటో, సిగ్నేచర్ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు ఫొటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్‌తో సంతకం చేయించుకోవాలి.
- అభ్యర్థి పేరులో దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ వంటి వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకునే అవకాశం ఉంటుంది.
- పరీక్ష సమయం పూర్తి అయిన తర్వాతనే అభ్యర్థులను బయటికి అనుమతిస్తారు.
టీజీ టెట్ - 2026 పరీక్షల షెడ్యూల్ వివరాలు….
- జనవరి 3న రెండు సెషన్స్ లో మ్యాథమాటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది.
- జనవరి 4న మొదటి సెషన్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు.
- జనవరి 5న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష
- జనవరి 6న మొదటి సెషన్ సోషల్ స్టడీస్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది.
- జనవరి 19వ తేదీన మెుదటి సెషన్‌లో పేపర్ 1(మైనర్) పరీక్ష.. అన్ని జిల్లాల అభ్యర్థులకు నిర్వహిస్తారు. బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ మీడియంలో వారికి ఉంటుంది.
- జనవరి 20వ తేదీన మెుదటి సెషన్ పేపర్ 2(మైనర్) పరీక్ష మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు హిందీ, కన్నడ, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సంస్కృతం మీడియంలో అన్ని జిల్లాల అభ్యర్థులకు జరుగుతుంది.
- టెట్ పరీక్షల షెడ్యూల్ వివరాలను https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో పూర్తిగా తెలుసోకవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

