తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TG TET - జనవరి 2027) కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సిలబస్ ఇప్పటికే విడుదలైంది. ప్రాథమిక పాఠశాలల (1 నుండి 5వ తరగతి వరకు) బోధనకు అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ టెట్ పేపర్-1 (తెలుగు) పూర్తి సిలబస్ వివరాలను అధికారులు విడుదల చేశారు. మొత్తం 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఐదు ప్రధాన విభాగాలు ఉండగా, ప్రతి విభాగానికి 30 మార్కుల చొప్పున కేటాయించారు. అభ్యర్థులు పరీక్షకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యేందుకు వీలుగా సబ్జెక్టుల వారీగా పూర్తి సిలబస్ విశ్లేషణ ఇక్కడ ఉంది.
శిశు వికాసం, బోధనా శాస్త్రం

Child Development and Pedagogy - 30 మార్కులు : ఈ విభాగంలో విద్యార్థుల మానసిక స్థితి, అభ్యసన పద్ధతులపై అభ్యర్థులకు ఉన్న అవగాహనను పరీక్షిస్తారు.
శిశు వికాసం : పెరుగుదల, పరిపక్వత, వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు (జీవ, మానసిక, సామాజిక), శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాస దశలు ఉంటాయి. పియాజే, కోల్బర్గ్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ సిద్ధాంతాలు, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ, Personality, మానసిక ఆరోగ్యం వంటి అంశాలు కీలకం.
అభ్యసనం అవగాహన (Understanding Learning): అభ్యసన స్వభావం, ప్రవర్తనావాదం (స్కిన్నర్, పావ్లోవ్, థార్న్‌డైక్), నిర్మాణాత్మక వాదం (పియాజే, వైగోట్స్కీ), గెస్టాల్ట్ సిద్ధాంతం, ప్రేరణ (Motivation), స్మృతి-విస్మృతి, అభ్యసన బదలాయింపుపై ప్రశ్నలు వస్తాయి.
బోధనా శాస్త్ర అంశాలు (Pedagogical Concerns): సమ్మిళిత విద్య (Inclusive Education), ప్రత్యేక అవసరాలు గల పిల్లలు (CWSN), ప్రాజెక్ట్, కృత్యాధార బోధన, తరగతి గది నిర్వహణ, నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE), NCF 2005, విద్యా హక్కు చట్టం (RTE 2009) అంశాలను చదవాలి.
లాంగ్వేజ్-1 తెలుగు (30 మార్కులు)
తెలుగు విభాగంలో కంటెంట్‌తో పాటు బోధనా పద్ధతులకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.
{{/usCountry}}తెలుగు విభాగంలో కంటెంట్‌తో పాటు బోధనా పద్ధతులకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.
{{/usCountry}}కంటెంట్ : పఠనావగాహన (పద్యం, గద్యం), 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యం, కవులు, రచయితలు, శతకాలు, కళలు, వేడుకలు, క్రీడలు-పాటలు ఉంటాయి. అలాగే సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి-వికృతులతో పాటు వ్యాకరణాంశాలైన సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్య రకాలు చదవాలి.
బోధనా పద్ధతులు (Pedagogy): మాతృభాష బోధన లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు (శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం), బోధనాభ్యసన ఉపకరణాలు (TLM), నిరంతర సమగ్ర మూల్యాంకనం (నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మూల్యాంకనం) అంశాలు ఉంటాయి.
లాంగ్వేజ్-2: ఇంగ్లీష్ (30 మార్కులు)
ఇంగ్లీష్ విభాగంలో కంటెంట్‌కు 24 మార్కులు, పెడగాజీకి 6 మార్కులు కేటాయించారు.
కంటెంట్ (24 మార్కులు): Parts of Speech, Tenses, Types of Sentences, Prepositions అండ్ Articles, Degrees of Comparison, Direct-Indirect Speech, Active అండ్ Passive Voice, Question Tags, Phrasal Verbs, Reading Comprehension, Vocabulary, Idiomatic Expressions, Sentence Correction, Error Identification అంశాలపై పట్టు సాధించాలి.
పెడగాజీ (6 మార్కులు): ఆంగ్ల భాషా చరిత్ర, స్వభావం, బోధన లక్ష్యాలు, Phonetics, LSRW నైపుణ్యాల అభివృద్ధి, బోధనా పద్ధతులు, Remedial Teaching, పాఠ్య ప్రణాళిక, CCE మూల్యాంకనం ఉంటాయి.
గణితం (Mathematics - 30 మార్కులు)
గణితంలో కంటెంట్‌కు 24 మార్కులు, పెడగాజీకి 6 మార్కులు కేటాయించారు.
కంటెంట్ (24 మార్కులు): సంఖ్యా వ్యవస్థ (Number System), భిన్నాలు (Fractions), అంకగణితం (శాతాలు, లాభనష్టాలు, నిష్పత్తి-అనుపాతం, సాధారణ-చక్రవడ్డీ, కాలం-పని, కాలం-దూరం, పన్నులు), రేఖాగణితం (2D, 3D ఆకారాలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు), కొలతలు (వైశాల్యాలు, ఘనపరిమాణాలు), దత్తాంశ నిర్వహణ (సగటు, మధ్యగతం, బాహుళకం, గ్రాఫ్‌లు), బీజగణితం (Algebra) అంశాలు ఉన్నాయి.
పెడగాజీ (6 మార్కులు): గణిత స్వభావం, బోధనా లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు, TLM, నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE), SAT పరీక్ష నిర్వహణ, లోపనివారణ బోధన (Diagnostic and Remedial Teaching) ఉంటాయి.
పరిసరాల విజ్ఞానం (Environmental Studies - 30 మార్కులు)
ఈ విభాగంలో సైన్స్, సోషల్ అంశాలు కలిపి కంటెంట్‌కు 24 మార్కులు, పెడగాజీకి 6 మార్కులు ఉంటాయి.
కంటెంట్ (24 మార్కులు): నా కుటుంబం, పని-ఆటలు, మొక్కలు-జంతువులు, మన ఆహారం, నివాసం, గాలి, శక్తి వనరులు, నీరు, మన శరీరం-ఆరోగ్యం-పరిశుభ్రత, మ్యాపింగ్ (దిక్కులు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం) అంశాలు ఉన్నాయి. వీటితో పాటు భారతదేశ చరిత్ర-సంస్కృతి, భారతదేశ భౌగోళిక స్వరూపం, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి-పరిపాలనా వ్యవస్థ (గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ కార్పొరేషన్ వరకు), భారత రాజ్యాంగం (ప్రాథమిక హక్కులు, విధులు, బాలల హక్కులు), విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవలు (108, 104 వాహనాలు) వంటి కీలక అంశాలను చేర్చారు.
పెడగాజీ (6 మార్కులు): పరిసరాల విజ్ఞానం పరిధి, బోధనా లక్ష్యాలు, సైన్స్-సోషల్ సబ్జెక్టులతో సంబంధం, అభ్యసన వాతావరణం, CCE విధానంపై ప్రశ్నలు అడుగుతారు.
అభ్యర్థులు పై సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ, ప్రతి సబ్జెక్టులోని బోధనా పద్ధతులపై (Pedagogy) ప్రత్యేక దృష్టి సారిస్తే టీజీ టెట్ పేపర్-1లో సులభంగా అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.