తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. తల్లిదండ్రుల వాట్సప్ నెంబర్ కు విద్యార్థుల హాల్‌టికెట్లను పంపనున్నారు. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది.

సెకండ్ ఇయర్ హాల్ టికెట్లలో ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ కూడా ఇస్తారు. ఫలితంగా సదరు విద్యార్థి ఫస్ట్ ఇయర్ లో తప్పిన(ఫెయిల్) పరీక్ష వివరాలు కూడా కనిపిస్తాయి. ఫలితంగా తల్లిదండ్రులకు కూడా ఓ అంచనా ఉండనుంది. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
ఇక హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే కాలేజీలను సంప్రదింవచ్చని కూడా ఇంటర్ బోర్డు సూచించింది. లేదా నోడల్ అధికారులను కూడా కలవొచ్చని పేర్కొంది. పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ వివరాలను చూడొచ్చని వివరించింది.
ప్రాక్టికల్ పరీక్షలు…
వచ్చే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 21వ తేదీ నాటికి పూర్తవుతాయి. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది. జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
టీజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ 2026:
- 25- 02 -2026 : పార్ట్ 1 (సెకండ్ లాంగ్వేజ్ -1)
- 27- 02 -2026 : పార్ట్ 2 - ఇంగ్లీష్ పేపర్ -1
- 02- 03 -2026 : మ్యాథ్స్ 1ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
- 5- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 1బీ, జువాలజీ, హిస్టరీ -1
- 9- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -1
- 12- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్
- 17- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1
టీజీ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ 2026:
- 26- 02 -2026 : పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ -2)
- 28- 02 -2026 : పార్ట్ 1 - ఇంగ్లీష్ పేపర్ -2
- 04- 03 -2026 : మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ -2
- 6- 03 -2026 : మ్యాథ్య్ పేపర్ 2బీ, జువాలజీ, హిస్టరీ -2
- 10- 03 -2026 : ఫిజిక్స్, ఎకానమిక్స్ -2
- 13- 03 -2026 : కెమిస్ట్రీ, కామర్స్ -2
- 16-03-2026: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ 2,
- 18- 03 -2026 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫ్రీ - 1