తెలంగాణ ఇంటర్ సిలబస్‌లో మార్పులు.. విద్యార్థులకు తగ్గనున్న తలనొప్పి!

తెలంగాణ ఇంటర్మీడియెట్ సిలబస్‌లో మార్పులు రానున్నాయి. ఇన్ని రోజులు విద్యార్థులు తలనొప్పిగా ఫీల్ అయ్యే సిలబస్‌లో మార్పులు చేసి తగ్గించనున్నారు.

Published on: Dec 31, 2025, 17:49:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్(TG BIE) సిలబస్‌లో మార్పులు చేయనుంది. సిలబస్ సవరణను చేపడుతోంది. గణితం, కెమిస్ట్రీ, కొన్ని సబ్జెక్టులలో మార్పులు చేస్తారు. దీంతో విద్యార్థులకు కాస్త భారం తగ్గనుంది.

తెలంగాణ ఇంటర్ సిలబస్
తెలంగాణ ఇంటర్ సిలబస్

తెలుగు భాష, చరిత్ర విషయానికొస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పాఠాలపై ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోంది. జేఈఈ, NEET UG వంటి వివిధ పోటీ ప్రవేశ పరీక్షలకు అనుసరించే NCERT సిలబస్ ఆధారంగా బోర్డు ఈ మార్పులను చేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి సిలబస్ సవరణను చేపట్టిన బోర్డు.. కఠినంగా ఉన్న కొన్ని గణితం 1B అంశాలను తొలగించింది. అంతేకాదు కెమిస్ట్రీ భాగాన్ని దాదాపు 30 శాతం తగ్గించగా, కొన్ని సబ్జెక్టులలో 20 శాతం కోత విధించారు.

ఇంటర్‌లో మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బీ పేపర్లు 75 మార్కుల చొప్పున జరుగుతున్నాయి. అయితే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి థియరీ పరీక్షను 60 మార్కులకు కుదిస్తారు. మిగిలిన 15 మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. కాలేజీలో చేతిలో 15 మార్కులు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యం, ప్రాజెక్టులు, అటెండెన్స్ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు వేస్తారు. ఫస్ట్ ఇయర్ వారికి కూడా ఇంటర్నల్స్ ఉంటాయన్నమాట.

ప్రస్తుతం మ్యాథ్స్ బీలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నట్టుగా బోర్డు గుర్తించింది. దీంతో ఇంటర్ బోర్డు మ్యాథ్స్ బీ పాఠ్య పుస్తకంలోని కొన్ని కఠినమైన చాప్టర్లను మ్యాథ్స్ ఏలోకి మార్చానుంది. ఈ మార్పులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.

ఎంఈసీ విద్యార్థులకు గణితం పేపర్‌కు మొత్తం మార్కులను 150 నుండి 100కి తగ్గించారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ ఒకేలా ఉంది. రెండు పేపర్లకు 150 మార్కులను శాతంగా తీసుకుని 100 మార్కులకు కుదించారు. ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు వేర్వేర్వుగా ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. సైన్స్ కోర్సులలో కూడా 20 నుంచి 30 శాతం సిలబస్ తగ్గనుంది.

అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్(ఏసీఈ) అనే కొత్త కోర్సు ప్రవేశపెడతారు. స్మార్ట్‌ఫోన్‌తో స్కాన్ చేసినప్పుడు సబ్జెక్టు అందించేలా.. పాఠ్యపుస్తకాలపై క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌లను ముద్రించాలని బోర్డు నిర్ణయించింది.

సవరించిన సిలబస్ ఆధారంగా తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తుంది. 2026 ఏప్రిల్ రెండో వారం నాటికి కొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల వేసవి సెలవుల్లో కొత్త సిలబస్‌పై లెక్చరర్లకు శిక్షణా కార్యక్రమాలను బోర్డు, కళాశాలలు నిర్వహించగలుగుతాయి.

పాఠ్యపుస్తకాల అనువాదాలు ఒకేసారి జరుగుతున్నాయి. గతంలో ఉర్దూ మీడియం పుస్తకాలు.. ఇంగ్లీష్ మీడియం ఎడిషన్ల తర్వాత ఒక సంవత్సరం అనంతరం విడుదలయ్యాయి. కానీ ఈసారి రెండు పుస్తకాలు ఒకేసారి ముద్రిస్తాయి. కాగితం నాణ్యతను కూడా పెంచుతున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More