...
...
Next Story

ఫీజు బకాయిల పేరుతో పరీక్షలకు అడ్డుకుంటే కాలేజీలపై సీరియస్ యాక్షన్!

Colleges Fee : ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులను పరీక్షలకు అడ్డుకుంటున్న కళాశాలలకు టీజీసీహెచ్ఈ గట్టి హెచ్చరిక జారీ చేసింది. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

Updated on: Apr 30, 2026 10:31 AM IST
Advertisement

ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందలేదనే సాకుతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించని కళాశాలలపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విద్యా సంస్థలకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాలేజీ ఫీజులు
కాలేజీ ఫీజులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదన్న నెపంతో కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల హాల్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు వచ్చిన వార్తలపై మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం అంగీకారం కాదని, ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఏ ఒక్క విద్యార్థి కూడా ఫీజు బకాయిల కారణంతో పరీక్షలకు దూరం కాకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

నిర్దేశిత అధికారులు లేదా విశ్వవిద్యాలయాల నుండి సరైన గుర్తింపు (Affiliation) లేకుండానే విద్యార్థులను చేర్చుకుంటున్న సంస్థల తీరుపై కూడా TGCHE స్పందించింది. అడ్మిషన్లు తీసుకునే ముందే ఆయా కళాశాలల గుర్తింపు స్థితిని సంబంధిత ప్రభుత్వ సంస్థలు లేదా యూనివర్సిటీల ద్వారా వెరిఫై చేసుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది.

అనుమతి లేని సంస్థల్లో చేరితే అది పూర్తిగా విద్యార్థులు, తల్లిదండ్రుల రిస్క్ మాత్రమేనని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. అక్కడి నుండి పొందే డిగ్రీలు లేదా సర్టిఫికెట్లు ఉన్నత చదువులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు, స్కాలర్‌షిప్‌లకు లేదా ఇతర అధికారిక అవసరాలకు చెల్లుబాటు కావు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొంది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు చేసే విద్యా సంస్థల ఉచ్చులో పడవద్దని విద్యార్థులకు విజ్ఞప్తి చేసింది.

ఇందులో ఉన్న ప్రమాదాలను వివరిస్తూ, అనధికారిక సంస్థలలో ప్రవేశాలు పూర్తిగా విద్యార్థులు, తల్లిదండ్రుల బాధ్యతపైనే ఉంటాయని ఉన్నత విద్యామండలి పేర్కొంది. అటువంటి సంస్థలు జారీ చేసిన డిగ్రీలు లేదా సర్టిఫికేట్లు ఉన్నత విద్య, ఉద్యోగం, స్కాలర్‌షిప్‌లు లేదా అధికారిక ప్రయోజనాల కోసం గుర్తింపు పొందకపోవచ్చు. అంతేకాకుండా సరైన అధికారం లేకుండా పనిచేస్తున్న సంస్థలు కఠినమైన చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి సంస్థలు చేసే తప్పుదోవ పట్టించే ప్రకటనలు లేదా తప్పుడు వాదనలకు విద్యార్థులు, తల్లిదండ్రులు బలికావద్దని కూడా సూచించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe