తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) Deputy Educational Officer / Head Master Grade - I ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో మెుత్తం 24 పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు జీతం ఉంటుంది. నవంబర్ 12వ తేదీన పరీక్ష జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లును టీజీపీఎస్సీ విడుదల చేసింది. నవంబర్ 11వ తేదీ రాత్రి 11.59 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

అభ్యర్థులు https://www.tgpsc.gov.in/ టీజీపీఎస్సీ అధిరిక వెబ్‌సైట్ వెళ్లాలి.
డౌన్‌లోడ్ హాల్ టికెట్ పర్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ లింక్ మీద క్లిక్ చేయాలి.
తర్వాత టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
క్యాండిడేట్ వెరిఫికేషన్‌లో భాగంగా లైవ్ ఫొటోగ్రాఫ్‌కు వెళ్తుంది.
ఫోట్ క్యాప్చర్అయిన తర్వాత హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ముఖ్యమైన సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం నుండి పరీక్ష రాసే వరకు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు బయోమెట్రిక్ ప్రక్రియ, ఇతర సమగ్ర వివరాలను ఇచ్చింది.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదు. ఫోర్‌నూన్ సెషన్ ఉదయం 9.30 గంటలకల్లా పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. ఆఫ్టర్‌నూన్ సెషన్ మధ్యాహ్నం 2 గంటలకల్లా గేట్లు క్లోజ్ అవుతాయి. అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ క్లోజింగ్ సమయానికి ముందే కేంద్రానికి చేరుకోవాలి.
పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ప్రభుత్వ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ కార్డు (ఫోటోకాపీలు లేదా స్కాన్ చేసిన ప్రతులు అనుమతించరు) తీసుకురావాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. హాల్ టికెట్లో ఫోటో సరిగ్గా లేని అభ్యర్థులు మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తెచ్చుకోవాలి.
{{/usCountry}}పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ప్రభుత్వ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ కార్డు (ఫోటోకాపీలు లేదా స్కాన్ చేసిన ప్రతులు అనుమతించరు) తీసుకురావాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. హాల్ టికెట్లో ఫోటో సరిగ్గా లేని అభ్యర్థులు మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తెచ్చుకోవాలి.
{{/usCountry}}ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు (స్మార్ట్‌వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు) అనుమతించరు. స్కెచ్ పెన్నులు, లాగ్ టేబుల్స్, పేపర్లు, ఛార్ట్‌లు, వాలెట్‌లు, పర్సులు తీసుకురావొద్దు. అభ్యర్థులు తమ చేతులకు/కాళ్లకు మెహందీ (గోరింటాకు), ఇంక్ వంటివి పెట్టుకోవద్దని సూచించారు. వీటి వల్ల బయోమెట్రిక్/వేలిముద్రల సేకరణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
మొత్తం 150 నిమిషాలు. పరీక్ష పూర్తయ్యే వరకు హాలు వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు. ద్విభాషా (Bi-lingual) పేపర్ ఉన్నప్పుడు లాగిన్ తర్వాత డ్రాప్-డౌన్ బాక్స్ ద్వారా ప్రాధాన్యత భాషను ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు భాషల మధ్య ఏదైనా వ్యత్యాసం/సందేహం ఉంటే, ఇంగ్లీష్ వర్షన్‌నే ప్రామాణికంగా పరిగణిస్తారు. అభ్యర్థులు స్క్రీన్ పైన కుడివైపు ఉన్న డ్రాప్-డౌన్ ద్వారా ఇంగ్లీష్ వర్షన్ చూడవచ్చు.
సమాధానాలు ఎంచుకోవడానికి మౌస్ మాత్రమే ఉపయోగించాలి. పరీక్ష సమయంలో కీబోర్డ్‌ను తాకకూడదు. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్ షీట్లను ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.