...
...
Next Story

TGPSC DEO Recruitment 2026 : డీఈవో ఉద్యోగాల అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇదిగో లింక్

TGPSC DEO Recruitment 2026 : తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO), గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 14, 2026, 05:12:56 IST
Advertisement

TGPSC DEO Recruitment 2026 : పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) మరియు గెజిటెడ్ హెడ్‌మాస్టర్ గ్రేడ్-I పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల ప్రతిష్టాత్మక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యాశాఖలో ఉన్నతాధికార హోదా కలిగిన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 జూలై 19వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

మొత్తం 24 ఖాళీలు…

డీఈవో రిక్రూట్‌మెంట్ అప్డేట్
డీఈవో రిక్రూట్‌మెంట్ అప్డేట్

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం మొత్తం 24 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థుల సౌకర్యార్థం వీటిని మల్టీ జోన్ల వారీగా విభజించారు. ఇందులో మల్టీ జోన్-I పరిధిలో 10 ఖాళీలు, మల్టీ జోన్-II పరిధిలో 14 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 58,850 నుంచి రూ. 1,37,050 వరకు ఆకర్షణీయమైన శ్రేణిలో జీతభత్యాలు చెల్లిస్తారు.

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూజీసీ (UGC) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • సదరు డిగ్రీ అభ్యర్థి బీఈడీ (B.Ed) కోర్సులో ప్రవేశించడానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో కలిగి ఉండటం తప్పనిసరి. దీనితో పాటు, కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు పీజీలో 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
  • 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, ఎన్‌సీసీ (NCC) ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేసిన వారికి 3 ఏళ్ల పాటు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు లభిస్తుంది.

దరఖాస్తు విధానం :

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks