TGPSC Seed Certification Office Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త అందించింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 'సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్' పోస్టుల భర్తీకి కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ రిక్రూట్‌మెంట్ కింద రాష్ట్ర స్థాయి కేడర్‌లో మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అర్హతలు….

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నిర్ణీత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ తో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ (M.Sc. Ag.) పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి విషయానికి వస్తే…. జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు స్కేల్ ఆఫ్ పే (జీతం) లభిస్తుంది.
ఈనెల 7 నుంచి దరఖాస్తులు…
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 7, 2026 నుంచి ఆగస్టు 12, 2026 వరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులను సమర్పించవచ్చు. విద్యార్హతలు, సిలబస్, ఎంపిక విధానం మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను ( https://www.tgpsc.gov.in/ ) సందర్శించాలని కమిషన్ సెక్రటరీ సూచించారు.