TGPSC Recruitment 2026 : టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల అప్డేట్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ఇదిగో లింక్

TGPSC Town Planning Assistant Recruitment :  టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.  అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 19, 2026, 10:24:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేట్ లెవల్‌లో 2 పోస్టులు, మల్టీజోన్ పరిధిలో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

ఆగస్టు 22 చివరి తేదీ…

అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 22, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను అక్టోబర్ 2026లో నిర్వహించేందుకు తాత్కాలికంగా షెడ్యూల్ ఖరారు చేశారు. పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుండి హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బి.ప్లానింగ్ లేదా బి.టెక్ ప్లానింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచారు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 జీతం చెల్లిస్తారు.
  • ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500 గా నిర్ణయించారు. అన్ని కేటగిరీల అభ్యర్థులు అదనంగా రూ.120 పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా:

  1. అర్హత గల అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in/ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ టీజీపీఎస్సీ ఐడీ(ఓటీఆర్), పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే సంబంధిత నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  5. వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More