...
...
Next Story

TGRJC Results 2026 : టీజీఆర్‌జేసీ గురుకుల అడ్మిషన్ల అప్డేట్ - కాల్ లెటర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TGRJC 2026 Call Letter : టీజీఆర్‌జేసీ గురుకుల ఫస్ట్ ఇంటర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన కాల్ లెటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Published on: May 27, 2026, 13:19:51 IST
Advertisement

TGRJC 2026 Call Letter : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్ ఈఐఎస్) నిర్వహించిన టీజీఆర్జేసీ సెట్-2026 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. గురుకుల కాలేజీలు, కేజీబీవీ ఎక్సలెన్స్​లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఎంపికైన విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అధికారిక వెబ్ సైట్ లో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచారు. వీటిని హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TGRJC 2026 కాల్ లెటర్ - డౌన్లోడ్ ఇలా:

  1. గురుకుల సొసైటీ అధికారిక వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in/TGRJCWEB/ లోకి వెళ్లాలి.
  2. హోమ్‌పేజీలో కనిపించే Download Call Letter లింక్‌పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాప్చాను నమోదు చేయాలి.
  4. వివరాలు సబ్మిట్ చేసిన వెంటనే మీ కాల్ లెటర్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డుతో పాటు కాల్ లెటర్ చాలా ముఖ్యం.

టీజీఆర్‌జేసీ సెట్‌ 2026 అప్డేట్
టీజీఆర్‌జేసీ సెట్‌ 2026 అప్డేట్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన ఉచిత విద్య, వసతి సౌకర్యాలు ఉండటంతో ఈ ప్రవేశ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మెరిట్ జాబితా ఆధారంగా విద్యార్థులకు ఆయా కాలేజీల్లో ఇంటర్ సీట్లను కేటాయించనున్నారు.

ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు కౌన్సిలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. విద్యార్థులు సాధించిన ర్యాంకు, వారు ఎంచుకున్న ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా గురుకుల కాలేజీల్లో గ్రూపుల వారీగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.

TGRJC ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా:

  • గురుకుల సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://tgrjc.cgg.gov.in ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న 'TG RJC Result 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • హాల్ టికెట్ నంబర్ లేదా పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలు సమర్పించిన వెంటనే మీ స్క్రీన్‌పై ర్యాంక్ కార్డు కనిపిస్తుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ఈ కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe